"సూపర్" స్పీడ్‌ కు బ్రేకులు వేసిన నాగార్జున హెయిర్ స్టైల్ ?

Veldandi Saikiran
అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మన్మధుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక నాగార్జున డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన చిత్రం "సూపర్". ఈ సినిమా 2005లో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు సోనుసూద్ మరొక కీలక పాత్రలో కనిపించి మెప్పించాడు.

ఈ సినిమాతోనే అనుష్క శెట్టి టాలీవుడ్ సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది. సూపర్ సినిమాతోనే బాలీవుడ్ అందాల తార అయేషా టకియా కూడా మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో తన అందం, నటనతో అబ్బాయిల హృదయాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో "గుచ్చి గుచ్చి చంపమాకు ఓయ్ లా"పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అయేషా నటించిన ఏకైక తెలుగు సినిమా సూపర్ కావడం గమనార్హం. అటు అనుష్క ఇందులో సెకండ్ హీరోయిన్ గా చేసి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతోనే తన సినీ కెరీర్ ప్రారంభించిన అనుష్క ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఆకట్టుకున్న ఈ చిన్నది తన నటన, అందంతో దర్శక నిర్మాతలను సైతం ఫిదా చేసింది.

ఇక ఈ సినిమాలో నాగార్జున లాంగ్ హెయిర్ లో కనిపించి అమ్మాయిల మనసులను ఆకట్టుకున్నాడు దోచుకున్నాడు. నాగార్జున హెయిర్ స్టైల్ ని చాలామంది ఫాలో అయ్యారు. ఇక మరికొందరేమో ఈ సినిమాలో నాగార్జున హెయిర్ స్టైల్ అస్సలు బాగాలేదని విమర్శలు చేశారు. లాంగ్ హెయిర్ కాకుండా షార్ట్ హెయిర్ ఉంటే చాలా బాగుండేది అంటూ కొంతమంది నెగిటివ్ గా ట్రోల్ చేశారు. ఇక ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని నాగార్జున కెరీర్ లో సక్సెస్ఫుల్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: