కీర్తి సురేష్ సినిమాలకు అందుకే దూరంగా ఉంటుందా.. త్వరలో గుడ్ న్యూస్ చెప్తుందా.. అసలు మ్యాటర్ ఇదే..!
ఇక త్వరలోనే కీర్తి సురేష్ పెళ్లి అంటూ.. అతనే కీర్తి పెళ్లాడబోయేది అంటూ.. నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.. ఇప్పుడు తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి షాకింగ్ వార్త వైరల్ గా మారింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేస్తుందంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరెవరో కాదు అనిరుధ్ రవిచంద్రన్ .. ఈ ఇద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
అయితే కిర్తి సురేష్ ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. 2013 లో వచ్చిన గీతాంజలి సినిమా ద్వారా హీరోయిన్గా మారింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కీర్తి సురేష్ తెలుగులో కూడా వరుస సినిమాల్లో నటించింది .. అలాగే మహానటి సినిమాతో జాతియ అవార్డు కూడా అందుకుంది. గత సంవత్సరం వరకు వరస సినిమాలో నటిస్తూ బిజీగా కొనసాగుంది కీర్తి సురేష్.. ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఇప్పుడు కీర్తి అనిరుధ్‌తో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నయి ఈ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అంటున్నారు. అయితే దీనిపై కీర్తి సురేష్ క్లారిటీ కూడా ఇచ్చింది. ‘ఆ వార్తలు అవాస్తవం. నేనూ, అనిరుధ్ మంచి స్నేహితులం.. అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కీర్తి సురేష్ ఇప్పుడు హిందీలో కూడా బిజీగా కానుంది. తమిళంలో ‘రివాల్వర్ రీటా’, ‘కన్నవేడి’ సినిమాల్లో నటిస్తోంది. ‘బేబీ జాన్’ అనే హిందీ చిత్రంలో వరుణ్ ధావన్‌తో నటిస్తుంది ఈ అమ్మడు.