నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో చాలా సినిమాలను వదిలేశాడు. ఇక బాయ్య ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఒక హీరో రిక్వెస్ట్ చేయడంతో ఆ మూవీనే వదిలేసాడట. మరి ఆ మూవీ ఏది ..? ఆ హీరో ఎందుకు రిక్వెస్ట్ చేశాడు ..? అసలు ఆ సినిమా రిసల్ట్ ఏమయింది ..? అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా జగపతిబాబు కీలక పాత్రలో కే ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో కథానాయకుడు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ లో రజనీ కాంత్ కి స్నేహితుడి పాత్రలో జగపతి బాబు నటించాడు. ఇక కే ఎస్ రవి కుమార్ మొదట ఈ సినిమా తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ స్నేహితుడి పాత్రలో జగపతి బాబు ను కాకుండా బాలకృష్ణను తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ కలిసి కథ మొత్తాన్ని వివరించాడట. ఆయన కూడా ఆ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ విషయం తెలిసిన రజనీ కాంత్ ఒక రోజు బాలకృష్ణకు ఫోన్ చేసి నా సినిమాలో స్నేహితుడి పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు అంట కదా నిజమేనా అని అడగ్గా ... అవును అని బాలకృష్ణ అన్నాడట. దానితో ఆ సినిమా నువ్వు చేయకు అని రజినీ అన్నాడట.
ఎందుకు అని బాలకృష్ణ అడగ్గా ... ఈ స్టార్ డం చాలా పెద్దది. నీ ఈమేజ్ ను మ్యాచ్ చేయాలి అంటే సినిమా కథలో చాలా మార్పులు చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఆ సినిమాలో నా స్నేహితుడి పాత్రకు అంత పెద్ద స్కోప్ లేదు. నీలాంటి స్టార్ ఈమేజ్ కలిగిన హీరో అలాంటి పాత్ర చేస్తే జనాలు ఒప్పుకోరు. సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అన్నాడట. దానితో బాలకృష్ణ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నాడట. అలా రజిని రిక్వెస్ట్ చేయడంతో బాలకృష్ణ ఓ మూవీ ని వదిలేసాడట. ఇక కథానాయకుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు.