చైతూ, సిద్ధార్థ కంటే ముందే.. అతని ఎఫైర్‌ పెట్టుకున్న సమంత ?

Veldandi Saikiran
తెలుగు సినీ ప్రేక్షకులకు సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సమంత వరుస పెట్టి సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిన ఈ చిన్నది కొన్ని సంవత్సరాల పాటు సీక్రెట్ గా ప్రేమాయణాన్ని నడిపింది.

అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా నాగచైతన్య, సమంత జంట వివాహాన్ని జరుపుకున్నారు. అయితే సమంత నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ నాగచైతన్య కన్నా ముందే సమంత టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ ను కూడా ప్రేమించింది. కొన్ని రోజులపాటు వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగింది. ఇద్దరూ కలిసి బయటకు వెళ్లడం, కొన్ని ప్రత్యేకమైన పూజలు కూడా చేయించుకున్నారు. వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం సమంత, నాగచైతన్యతో ప్రేమలో పడింది.

అయితే సమంతకు నాగచైతన్య, సిద్ధార్థ్ కన్నా ముందు ఇంకో వ్యక్తిపై కూడా ప్రేమ ఉందట. సమంత ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే తన సీనియర్ ను సీక్రెట్ గా లవ్ చేసిందట. కానీ ఈ విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పడానికి సమంత కాస్త భయపడిందట. తనకన్నా సీనియర్ కావడంతో ప్రేమ విషయం చెబితే ఏమనుకుంటాడో అనే భయంతో అలానే సీక్రెట్ గా ప్రేమించిందట.

కొద్ది రోజులకు చెప్పాలని అనుకునే సమయానికి ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో రిలేషన్ ఉందని తెలిసి సమంత బాధపడిందట. కొద్ది రోజులపాటు కాస్త బాధపడి మళ్లీ తన చదువుపై ఫోకస్ పెట్టింది పెట్టిందట. ఆ వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా సమాచారం. ఈ విషయాన్ని సమంతనే నేరుగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: