పెళ్లి చేసుకోకుండా.. ఫోటోలతోనే కాలక్షేపం చేస్తున్న హీరోయిన్..!
అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి ఈ విషయాన్ని ఈ జంట అధికారికంగా ధ్రువీకరించారు.. ఇటీవల వీరిద్దరూ వివి (విమల - వినయ్) అనే పేరుతో సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉన్నారు. తమిళ చిత్రాలలో విలన్ గా నటించి బాగానే పేరు సంపాదించుకున్న వినయ్ రామ్ ఈ ఫోటోలలో చాలా రొమాంటిక్ యాంగిల్స్ లలో ఫోటోలను సైతం షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది.
ఈ ప్రత్యేకమైన ఫోటో షూట్ అందరినీ ఆశ్చర్యానికి కలిగిస్తున్నది. బ్లాక్ దుస్తులను ఈ జంట చాలా స్టైలిష్ గా ఫోటోలను షూట్ చేసి మరి షేర్ చేసింది. ఈ ఫోటోల లో వీరిమధ్య ఉండే సాన్నిహిత్యాన్ని సైతం చూపించేలా షేర్ చేశారంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. డేటింగ్ను అధికారికంగా చెప్పొచ్చు కానీ వివాహం ఎప్పుడో చెప్పాలి అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఫోటోల తోనే కాలక్షేపం చేస్తున్నారా అంటూ మరి కొంతమంది నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక విమల రామన్ తెలుగులో చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, గాయం-2 తదితర చిత్రాలలో నటించింది. విమలా రామన్ మాత్రం తెలుగులో ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయింది.