ఏంటి నా దేవుడు అంటూ తండ్రిని పొగిడే అల్లు అర్జున్ తండ్రి పరువుని గంగలో కలిపేసారా..ఇంతకీ తండ్రి పరువు తీసేంతలా అల్లు అర్జున్ చేసిన పని ఏంటి.. అసలు నిజం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. గూగుల్ ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్ అన్ స్టాపబుల్ షో కి వెళ్లిన వార్తలే వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ బాలకృష్ణ మధ్యలో చాలా ఫన్నీ సంభాషణతో పాటు ఎన్నో తెలియని విషయాలు కూడా బయటపడ్డాయి. ఇందులో భాగంగా అల్లు అర్జున్ తన తండ్రి గురించి మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఇంతకీ అల్లు అర్జున్ తన తండ్రి గురించి ఏం మాట్లాడారంటే.. మా నాన్న పరమ పిసినారి.. ఆయన ఓ బడ్జెట్ పద్మనాభం.. ఆయన డబ్బులు తీసుకుందామంటే పర్సులో కూడా పెట్టుకునే వారు కాదు. అసలు ఆయన పర్స్ కూడా మెయింటైన్ చేయరు.
ఆయన తన డబ్బు మొత్తం బట్టల్లో దాచుకునేవారు. అలా పెద్ద స్కూల్లో ఉన్న నన్ను నా చదువు, ప్రవర్తన చూసి చిన్న స్కూల్లో చేర్పించారు. ఇక నేను వెళ్లే స్కూల్లో కార్లో వచ్చే ఏకైక వ్యక్తిని నేనే. అందుకే అందరి ముందు నాకు నామోషి అనిపించి కారుని వీధి చివరే ఆపేసి నేను నడుచుకుంటూ వెళ్లేవాడిని. అలాగే నేను పెద్దింటి అబ్బాయిని అంటే కూడా ఎవరు నమ్మకపోయేవారు.నా వేషధారణ అలా ఉండేది. ఇక మా నాన్న పిసినారి తనం చాలా మెయింటైన్ చేసేవారు. ఓసారి కారు కొనివ్వమని అడిగితే నువ్వు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యాక కొనిస్తానని చెప్పారు.తీరా 18 సంవత్సరాలు పూర్తయ్యాక ఓ డొక్కు కార్ తీసుకొచ్చి నా మొహాన పడేశారు.
ఇక ఆ కారుని నడిపితే కంటే తోస్తేనే తొందరగా వెళుతుంది. అలాంటి కారు నాకు ఇచ్చారు అంటూ అల్లు అర్జున్ తండ్రి గురించి నిజాలు చెప్పారు. అయితే అల్లు అర్జున్ తండ్రి గురించి చెప్పిన మాటలకు బాలకృష్ణ పగలబడినవ్వారు. కానీ ఇదంతా తన మంచికే అని మద్య తరగతి జీవితం ఎలా ఉంటుందో కూడా తనకి తెలిసి వచ్చింది అంటూ అల్లు అర్జున్ తన తండ్రి ఇచ్చిన జీవితం గురించి పొగుడుతూ అలాగే తిట్టుకుంటూ మాట్లాడారు. ప్రస్తుతం అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో అల్లు అరవింద్ మరీ అంత పిసినారా..డబ్బు విషయంలో అలా ఉండేవారా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..