ఏంటి కమల్ హాసన్ రజినీకాంత్ లు కలిసి ఆ తెలుగు డైరెక్టర్ పై చేయి చేసుకోవాలనుకున్నారా.. ఇంతకీ రజినీ కమలహాసన్ లు ఏ తెలుగు డైరెక్టర్ పై దాడి చేయాలని వెళ్లారు. ఇంతకీ ఆ డైరెక్టర్ చేసిన తప్పేంటి అనేది ఇప్పుడు చూద్దాం.. కమల్ హాసన్ రజినీకాంత్ ఇద్దరు కలిసి గొడవ పెట్టుకోవాలనుకుంది ఎవరితోనో కాదు ది లెజెండరీ డైరెక్టర్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. అయితే రాఘవేంద్రరావు పై వాళ్లు దాడి ఎందుకు చేయాలనుకున్నారంటే శ్రీదేవి హీరోయిన్గా చేసిన మొదటి మూవీ పదహారేళ్ళ వయసు అందరికీ తెలుసు.. అయితే ఈ సినిమాలో చంద్రమోహన్ హీరోగా చేసారు.అయితే ఈ మూవీ తమిళంలో విడుదలైన 16 వయతినిలే అనే మూవీకి రీమేక్. ఈ తమిళ మూవీలో రజినీకాంత్,కమల్ హాసన్,శ్రీదేవి చేశారు. అలా తెలుగులో శ్రీదేవి, చంద్రమోహన్ విలన్ గా మోహన్ బాబుని తీసుకొని రాఘవేంద్రరావు చేశారు.
అయితే తమిళ సినిమా క్లైమాక్స్ రాఘవేంద్రరావుకి నచ్చలేదు.దాంతో క్లైమాక్స్ మార్చి జైలు నుండి వచ్చాక చంద్రమోహన్ శ్రీదేవి మెడలో తాళి కట్టే సన్నివేశాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశారు.అయితే తమిళంలో ఈ సీను ఉండదు. హీరో కోసం శ్రీదేవి అలా వెయిట్ చేస్తూనే ఉంటుంది.దాంతోనే ఎండ్ చేశారు. కానీ అది తమిళ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినంతగా తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరని గ్రహించిన రాఘవేంద్రరావు సినిమా క్లైమాక్స్ మార్చి చివర్లో శ్రీదేవి మెడలో చంద్రమోహన్ తాళికట్టే సన్నివేశం యాడ్ చేశారు. అయితే ఈ విషయం రజినీ కమల్ కి ఎవరో చెప్పడంతో వాళ్లు రాఘవేంద్రరావు ఇంటికి వెళ్లి మా సినిమాని ఎందుకలా చెడగొడతారు అని వార్నింగ్ ఇవ్వాలని అనుకున్నారట.
అయితే ఈ విషయం శ్రీదేవి డైరెక్టర్ రాఘవేంద్రరావుకి ఫోన్ చేసి చెప్పి మీ ఇంటికి వాళ్ళు వస్తున్నారని అందట.అయితే దానికి రాఘవేంద్రరావు రానివ్వండి అని అన్నారట. ఆ తర్వాత రజినీ కాంత్ కమల్ లు ఇంటికి వచ్చాక అసలు విషయం చెప్పాడట రాఘవేంద్రరావు. అంతేకాకుండా సినిమా ఫస్ట్ షో ముగిసాక బాగుంటే ఉండనిద్దాం లేకపోతే మీ సినిమా క్లైమాక్స్ తోనే ముగిద్దాం అని రాఘవేంద్రరావు రజిని కమల్ కి చెప్పారట. ఇక వాళ్లు కూడా ఓకే అన్నారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మొదటి షో తోనే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో రాఘవేంద్రరావు తన నిర్ణయం సరైందేనని అనుకున్నారు.అయితే ఈ విషయాన్ని రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు