చంద్రబాబు కొత్త సర్కార్‌ కుట్రలు...వణికిపోతున్న బన్నీ..?

Veldandi Saikiran
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప2. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా మంచి విజయం సాధించిన తరుణంలో పుష్ప-2 సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పోస్టర్స్, టీజర్లకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. పుష్ప-2 సినిమా విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగాను నయా రికార్డులను నమోదు చేసింది.
ఈ క్రమంలోనే రన్ టైం విషయంలోనూ పుష్ప-2 సినిమాపై ఒక కొత్త రికార్డును సృష్టించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. పుష్ప-2 సినిమా రన్ టైమ్ దాదాపు 3 గంటల 15 నిమిషాల వరకు వచ్చిందని సమాచారం . ఇంకా రెండు పాటలతో పాటుగా కొంత ప్యాచ్ వర్క్ కూడా జోడించాల్సి ఉందట. ఇలా అన్నింటినీ కలిపితే ఈ సినిమా రన్ టైం సుమారు 3 గంటల 40 నిమిషాల వరకు ఉంటుందని సమాచారం అందుతుంది.

ఒకవేళ ఎడిటింగ్ లో ఎంతవరకు కట్ చేసిన కూడా కనీసం 3 గంటలు లేదా 3 గంటలు 10 నిమిషాల పైనే నిడివి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ సంబరపడుతున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్స్ రేట్లను పెంచాలని కోరారట.. ఈ విషయంపై తాజాగా చంద్రబాబు స్పందించింది. సినిమా టిక్కెట్ల రేట్లను అసలు పెంచబోమని కరాకండిగా చెప్పేశారు.
అయితే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబు సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ రెండు కుటుంబాల మధ్య గొడవల కారణంగానే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని అల్లు అర్జున్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. మరి ఏపీలో టికెట్ల రేట్లను పెంచుతారా లేదా అనేది చూడాలి. కాగా, పుష్ప సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: