ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలోని అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలా పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ కి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే బన్నీ ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 కు కొనసాగింపుగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే వెయ్యి కోట్లకి పైగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అదిరిపోయే రేంజ్ లో పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హీరోలలో షారుక్ ఖాన్ , తళపతి విజయ్ అత్యధిక పారితోషకాలు తీసుకున్న హీరోల లిస్టులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగినట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరిని కూడా అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మూవీ తో బీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... పుష్ప పార్ట్ 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు , ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ నటుడు కూడా ఒక్క సినిమా కోసం ఇంత మొత్తం లో పారితోషకం తీసుకోలేదు అని , ఇది ఒక అరుదైన రికార్డు అని ఓ వార్త వైరల్ అవుతుంది.
మరి పుష్ప పార్ట్ 2 మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్నట్లయితే అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెరిగి ఈయన పారితోషకం కూడా భారీ ఎత్తున పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది అని చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు. మరి పుష్ప పార్ట్ 2 మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో ... ఈ మూవీ తో బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.