ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరా అని లిస్ట్ రాస్తే అందులో అల్లు అర్జున్-సుకుమార్ పేర్లు తప్పక ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడో ఆర్యతో మొదలైన వీళ్ల స్నేహం పుష్ప 2 వరకూ 2 దశాబ్దాలుగా అంతే స్ట్రాంగ్‌గా కొనసాగుతుంది. మధ్యలో వీరి మధ్య కూడా పుల్లలు పెట్టడానికి చాలా మంది ట్రై చేశారనుకోండి.. అది వేరే విషయం. కానీ వాటిని కూడా సైలెంట్‌గా నవ్వుతూ ఎదుర్కొని వారి ఫ్రెండ్షిప్ను అలానే ముందుకు తీసుకువెళ్తున్నారు బన్నీ-సుక్కు.ఇదిలావుండగా గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ -సుకుమార్ మధ్య వివాదం గురించి అనేక రకాల వార్తలు తెర మీదకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అదేమీ లేదని బన్నీ టీంతో పాటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.ఇదిలావుండగా సుకుమార్ పై బన్నీ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.అవేమిటంటే సుకుమార్ విషయంలో నాకు అస్సలు నచ్చనిది ఆయన లేజీనెస్ రేపు షూటింగ్ ఉంటే, ఈరోజు కాల్ చేసి డార్లింగ్ నేను సీన్ రాసుకుంటా, ఎల్లుండి నుంచి చేద్దామని అంటాడు. ఇలా పోతూనే ఉంటుంది. ఏదైనా సీన్ నచ్చకపోతే అస్సలు కాంప్రమైజ్ కాడు. తీసిన సీన్‌ని ఎన్ని సార్లైనా తీయాల్సిందే.ఆ విషయంలో అస్సలు తగ్గేదిలే అంటాడు.ప్రతీ సీన్ విషయంలో సుకుమార్, చాలా పక్కాగా ఉండేవాడు. డార్లింగ్ నీకు నేషనల్ అవార్డు కావాలంటే ఈ పర్పామెన్స్ సరిపోదు, ఇంకా ఇంకా కావాలని అడిగేవాడు.. మా మధ్య కథ గురించి ఎంత చర్చ జరిగిందో, పర్ఫామెన్స్ విషయంలో అంత కంటే ఎక్కువ చర్చ జరిగేది. నిజానికి అసలైన పుష్ప ఆయనే.అంటూ వ్యాఖ్యానించాడు అల్లు అర్జున్.ఈ నేపథ్యంలో నే ఇంతకుముందు రంగస్థలం సమయంలో కూడా రామ్ చరణ్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు. సినిమా బాగా లేట్ అవుతోందని, త్వరగా అయిపోగొట్టమని సుకుమార్‌కి చెప్పాలంటూ తన అభిమానులను కోరాడు రామ్ చరణ్. అంతకుముందు సుక్కూతో కలిసి పని చేసిన మహేష్, ఎన్టీఆర్ మాత్రం ఈ రకమైన వ్యాఖ్యలు చేయలేదు.ప్రస్తుతం బన్నీ కామెంట్స్ వైరల్ గా మారాయి.