అక్కినేని అఖిల్ జాతకం అస్సలు బాలేదుగా.. ఈ హీరో ఖాతాలో ఏకంగా ఇన్ని ఫ్లాపులా?

Reddy P Rajasekhar

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరు నెలల వయస్సులోనే సిసింద్రీ సినిమాలో నటించి విజయాన్ని సొంతం చేసుకున్న అరుదైన ఘనత అఖిల్ సొంతమని చెప్పవచ్చు. సిసింద్రీ మూవీ కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధించింది. అఖిల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు వచ్చిన సమయంలో చాలామంది అఖిల్ మరో మహేష్ బాబు అవుతాడని భావించారు. టాలీవుడ్ స్టార్ హీరోలకు అఖిల్ గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వినిపించాయి.
 
అయితే అక్కినేని అఖిల్ కు సినిమా ఇండస్ట్రీ అస్సలు కలిసిరాలేదు. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన "అఖిల్" సినిమాతో అఖిల్ సినీ కెరీర్ మొదలు కాగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అయితే సొంతం చేసుకోలేదు. ఈ సినిమా తర్వాత అఖిల్ హలో, మిస్టర్ మజ్ను సినిమాలలో నటించారు. విక్రమ్ కె కుమార్, వెంకీ అట్లూరి లాంటి క్రేజీ డైరెక్టర్లు ఈ సినిమాల కోసం పని చేసినా ఫలితం లేకుండ పోయింది.
 
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ హిట్ సాధించినా ఈ సినిమా అఖిల్ ఫ్యాన్స్ కోరుకున్న భారీ రేంజ్ హిట్టైతే కాలేదు. ఏజెంట్ సినిమా మిగిల్చిన నష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు. ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీలో సైతం అందుబాటులోకి రాలేదనే సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమా రిజల్ట్ వల్ల అఖిల్ కెరీర్ కు సైతం బ్రేక్ పడింది.
 
అఖిల్ కొత్త సినిమాలకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలకు సంబంధించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అఖిల్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అఖిల్ రెమ్యునరేషన్ పరిమితంగా ఉండగా అక్కినేని ఫ్యామిలీ సొంత బ్యానర్ లో కూడా అఖిల్ సినిమాలు తెరకెక్కనున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: