సీనియర్ నటుడు చంద్రమోహన్ , ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధ్య ఉన్న రిలేషన్ ఇదే..!
సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తో అటు చంద్రమోహన్ కు ఇటు కె . విశ్వనాథ్ కీ కూడా మంచి బంధుత్వం ఉండేది . ఆ బంధుత్వం ఎలాంటిది అంటే చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య పెళ్లి చేసుకున్నారు . అలా వీరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఏర్పడింది . అలానే మరోవైపు చంద్రమోహన్ కి , కె విశ్వనాథ్ గారి తో కూడా బంధుత్వం ఎలా ఏర్పడింది అనే విషయానికి వస్తే .. తన పెదనాన్న కొడుకే విశ్వనాధ్ అన్ని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు . అలా వీరీ మధ్య కూడా అన్నదమ్ముల బంధం ఏర్పడింది .
ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సీతామహాలక్ష్మి , సీత కథ , సిరిసిరిమువ్వ , శంకరాభరణం వంటి సినిమాలు వచ్చి మంచి విజయలు అందుకున్నాయి. ఇకపోతే గతంలో కూడా విశ్వనాథ్ గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ.. సినిమా బంధం కంటే మా ఇద్దరి మధ్య కుటుంబ బంధమే ఎక్కువగా ఉంది . మద్రాస్ లో ఉన్నప్పుడు ఒకే చోట స్థలం కొని .. పక్కపక్కనే ఇల్లు నిర్మించుకొని 25 సంవత్సరాలు ఉన్నాము అంటూ చంద్రమోహన్ వెల్లడించారు . ఇక అలా వీరు ముగ్గురు చంద్రమోహన్ , కే విశ్వనాథ్ , ఎస్పీ బాలసుబ్రమణ్యం కూడా అన్నదమ్ములు కావడం విశేషం,. అంతేకాదు వీరి ముగ్గురు కాంబినేషన్ లో వచ్చిన శంకరాభరణం సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ లోనే ఓ గొప్ప సినిమాగా మిగిలిపోయింది .