వామ్మో.. అమలను కాదని పెళ్లి తర్వాత నాగార్జున ఆ హీరోయిన్ కోసం అంత పని చేశాడుగా..!
అలాంటి హీరోయిన్‌ల్లో అనుష్క , రమ్యకృష్ణ , స్నేహ , ఆమని , టబు ఇలా ఎంతో మంది హీరోయిన్లు నాగార్జున లిస్ట్ లో ఉన్నారు. అయితే నాగార్జునిన సినీ కెరీర్ లో మిగతా హీరోలతో పోల్చుకుంటే లవ్ ఎఫైర్ లిస్ట్ కాస్త ఎక్కువనే చెప్పాలి. రమ్యకృష్ణ , టబు , అనుష్క వంటి హీరోయిన్లతోనే ఎక్కువగా ఆయన ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు అనుష్క , టబు ఇప్పటికి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నాగార్జున అంటూ వార్తలు ఇప్పటికీ వస్తున్నాయి . అయితే ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న లక్ష్మికి విడాకులు ఇచ్చి అమలను ప్రేమించి వివాహం చేసుకున్న నాగార్జున ఆమెని కాదు ని మరొక హీరోయిన్ కోసం ఏకంగా ఖరీదైన ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చారట .
ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క శెట్టి .. అప్పట్లో సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈమె రెండు మూడు సినిమాలు వరుసగా నాగ్‌తో కలిసి నటించేసరికి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గట్టిగా వినిపించాయి. అదే సమయంలో నాగార్జున ఆమె కోసం హైదరాబాదులో ఉండటానికి ఒక ఖరీదైన ఫ్లాట్ ను కూడా బహుమతిగా ఇచ్చారట అంతే కాకుండా ఇప్పటికీ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ లోనే అనుష్క ఉంటుందని తెలుస్తుంది. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి ఖరీదైన బహుమతులు హీరో, హీరోయిన్లు ఇచ్చుకోవడం సర్వసాధారణం. కానీ ఇలాంటి వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఏది ఏమైనా సొంత భార్య ఉండగానే అనుష్క కోసం ఆయన మళ్ళీ ఖరీదైన ప్లాట్ ను కొనివ్వడంతో ఈ విషయం కూడా సోషల్ మీడియా లో కాస్త హాట్ టాపిక్ గా మారడం విశేషం .