టాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 'తమన్' ఈ స్థాయికి రావడానికి ఎంతగానో కష్టపడ్డాడు.తానూ టాలీవుడ్ ప్రేక్షకులకి "బాయ్స్" సినిమాతో పరిచయం అయ్యాడు."కిక్" సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన తమన్ మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు.మ్యూజిక్ డైరెక్టర్ గా అలా మొదలైన తమన్ ప్రయాణం ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాల్తో బిజీ అయ్యే స్థాయికి చేరింది.అయితే తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు శంకర్ గురించి తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు."బాయ్స్" సినిమా సమయంలో శంకర్ గారు నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని అని ఆయన గుర్తించేందుకు ఇన్నేళ్లు సమయం పట్టింది.శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా డ్రీం..అది ఇన్నాళ్లకు 'గేమ్ చేంజర్' సినిమాతో నెరవేరింది'' అని తమన్ తెలిపారు.
నేడు (నవంబరు 16) తమన్ పుట్టినరోజు.ఈ సందర్భంగా తన మ్యూజిక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ తెలిపారు.గతంలో నా దగ్గరకు అన్నిరొటీన్ కథలు వచ్చేవి. కానీ ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగింది విభిన్నకథలు వస్తున్నాయి కాబట్టి నేను కూడా డిఫరెంట్ గా మ్యూజిక్ ఇస్తున్నట్లు తమన్ తెలిపారు. సినిమాలో కంటెంట్ మిస్ అయితే ఎంత గొప్పగా మ్యూజిక్ ఇచ్చినా లాభం ఉండదు. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా మ్యూజిక్ ఇవ్వాలని తమన్ తెలిపారు. కొన్ని చిత్రాలకు సౌండ్ కంటే వాయిస్ ఎక్కువగా వినిపించాలి. మరికొన్నింటికి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువగా వాడాలి అని తమన్ తెలిపారు.శంకర్ గారితో చేస్తున్న "గేమ్ ఛేంజర్ "..నాకు ఎంతో ప్రత్యేకం ఆ సినిమాకు నేనిచ్చిన మ్యూజిక్ కచ్చితంగా ఫ్యాన్స్ కి నచ్చుతుందని తమన్ అన్నారు.ప్రస్తుతం తమన్ భారీ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు.ప్రభాస్ "రాజా సాబ్ ",బాలయ్య "దాకు మహారాజ్ ",పవన్ కల్యాణ్ "ఓజి" ,రాంచరణ్ "గేమ్ ఛేంజర్ "...తాజాగా అల్లుఅర్జున్ పుష్ప 2 కి కూడా తమన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు.దీనితో తమన్ క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా అయితే లేదు.