ఒక్క యేడాదిలో ఆహా కు ఏకంగా ఇన్ని కోట్లు బొక్క పడిపోయిందా...!
ఆహా కార్యకలాపాల వస్తున్న ఆదాయం కేవలం 133 కోట్లే అని అంటున్నారు. ఆపరేషన్ ఇన్కమ్ కాకుండా మిగిలిన ఆదాయాలు కేవలం 4 కోట్లు మాత్రమే ఆహా సంపాదిస్తుంది. ఇలా మొత్తంగా ఆహా సంస్థ 137 కోట్ల వరకు రాబడుతుంది. అయితే ఖర్చులు మాత్రం ఆదాయానికి మించి 277 కోట్లకు పైగా ఉన్నాయి .. ఇలా ఆహా ఓటీటీ సంస్థ 105 కోట్ల వరకు భారీ నష్టాన్ని చవి చూసింది. అయితే గతంలో పోల్చుకుంటే ఆహా పనితీరు కొంచెం మెరుగుపడిందని కూడా అంటున్నారు.. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయం కన్నా 2023 - 24 లో వచ్చిన ఆదాయం 9% మేర పెరిగిందని అంటున్నారు. గత సంవత్సరంలో 122 కోట్లకు ఉన్న ఆదాయం ఇప్పుడు 135 కోట్లకు పెరిగింది.
ఇదే క్రమంలో నష్టాలు కూడా కొంతమేర తగ్గిందని కూడా అంటున్నారు. 2022-23లో ఆహాకు వచ్చిన నష్టాలు రూ. 120 కోట్లు.. ఇప్పుడు రూ. 105 కోట్లకు నష్టం తగ్గింది. అంటే 13% శాతం మేర నష్టం తగ్గినట్లుగా కంపెనీ ప్రకటించింది. ఆహా సంస్థ తెలుగు లో మొదలు పెట్టిన తర్వాత తమిళంలోనూ తన కార్యకలాపాలు ప్రారంభించింది. స్థానిక భాషల సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాల డబ్బింగ్ వెర్షన్లను రిలీజ్ చేస్తున్నారు. అన్ స్టాపబుల్ వంటి షోలనూ టెలికాస్ట్ చేస్తున్నారు . నిలకడగా ఆదాయం పెరుగుతున్న అప్పటికీ .. నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయి. ఆహా యజమాన్యం చెబుతుంది