ఫ్యామిలీ హీరో జగపతిబాబు.. బాలయ్య 'లెజెండ్' సినిమాతో విలన్ గా మారారు.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో జగపతిబాబుకి విలన్ గా వరుస ఆఫర్స్ వచ్చాయి.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాలలో కూడా జగపతిబాబు విలన్ గా నటించాడు.ఎన్టీఆర్ ,సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ "నాన్నకు ప్రేమతో".. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు.జగపతిబాబు ఈ సినిమాలో విలన్ గా నటించాడు.ఎన్టీఆర్ సినిమా అంటే విలన్ తో మాస్ ఫైట్స్ కచ్చితంగా ఉంటాయి.కానీ సుకుమార్ ఈ సినిమా చాలా క్లాస్ గా తీసాడు.జగపతిబాబుతో ఫైట్స్ లేకపోయినా కూడా ఆయనలో విలనిజాన్ని సరికొత్త కోణంలో చూపించాడు.కొన్నిసార్లు నటనలో ఎన్టీఆర్నీ డామినెటే చేసారు..ఊర మాస్ ఎలిమెంట్స్ లేకపోయినా ఈ సినిమా అద్భుత విజయం సాధించింది
.ఇక ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన "అరవింద సమేత వీర రాఘవ "..సినిమాలో కూడా జగపతిబాబు విలన్ గా నటించాడు.అయితే ఈ సినిమాలో జగపతిబాబుది పక్కామాస్ రోల్.బసిరెడ్డి అనే పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ గా జగపతిబాబు అద్భుతంగా నటించాడు.వీరరాఘవగా ఎన్టీఆర్ కూడా తనదైన శైలిలో అద్భుతంగా నటించాడు.ఆ సినిమా కూడా ఎన్టీఆర్ కెరీర్ లో మంచి విజయం సాధించింది.అయితే రెండు సినిమాలలో ఎన్టీఆర్ తో నటించడం గురించి జగపతిబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నా పాత్ర ఎంతో ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. నాకు ఆ పాత్ర బాగా కుదిరింది.ఆ సినిమాలో నాది చాలా అగ్రెసివ్ రోల్. తారక్ పాసివ్ రోల్ లో నటించాడు. అంత స్టార్డం ఉన్న హీరో అలాంటి పాత్ర ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి.అయితే తారక్ మాత్రం నా దగ్గరకు వచ్చి నువ్వు ఆ రోల్ చేస్తున్నావ్, నన్ను ఈ రోల్ చేయిస్తున్నావ్, నీ క్యారెక్టర్ చాలా బాగుంది అని అంటుండేవాడు. ప్రతి రాత్రి నన్ను తిట్టేవాడు. ప్రేమతోనే తిట్టేవాడు అనుకోండి అని జగపతిబాబు నవ్వుతు చెప్పారు.
అరవింద సమేత వీర రాఘవ ప్రీరిలీజ్ వేడుకలో కూడా..ఈ సినిమా గురించి తలుచుకుంటే ముందు బసిరెడ్డి గుర్తుకు వస్తాడు తర్వాత నేను గుర్తుకు వస్తాను అని అన్నారు. అది చాలా పెద్ద స్టేట్మెంట్. తర్వాత ఎన్టీఆర్ నా వద్దకు వచ్చి బాబు నీతో నాకు కుదరదు. నువ్వు నన్నే ప్రతి సినిమాలో ఆడేసుకుంటున్నావ్. అలా ఇంక జరగకూడదు. ఇక నీతో చేసిన సినిమాలు చాలు. ఓ నాలుగైదేళ్లు నీ ముఖం కూడా నాకు చూపించకు అని అనేసాడని జగపతిబాబు తెలిపారు.అయితే ఈ సంభాషణ అంతా జగపతిబాబు-ఎన్టీఆర్ మధ్య సరదాగానే జరిగింది. ఎన్టీఆర్ అడిగినట్లే జగపతిబాబు ఎన్టీఆర్ తో మళ్ళీ నటించలేదు..