న‌య‌న Vs ధ‌నుష్‌: ఇద్ద‌రి మ‌ధ్య అస‌లు క‌థ వేరే ఉందా...?

RAMAKRISHNA S.S.
ప్రస్తుతం కోలీవుడ్ లో నయనతార - ధనుష్ గొడవ అందరినీ ఓ కుదుపు కుదిపేస్తుంది. మామూలుగా వీరిద్దరు వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే నయనతార ఇప్పుడు ఓపెన్ లెటర్ రిలీజ్ చేసింది. అందులో ధనుష్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఎవరు స్థాయిలో విమర్శలు చేశారు. నయన్ - ధనుష్ మధ్య ఇన్ని విభేదాలు ఉన్నాయా ? ఇద్దరి మధ్య ఇంత కథ నడిచిందా అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. న‌య‌న్‌ బియాండ్ ది ఫెయిరీ టెయిల్‌ అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ సంస్థ న‌య‌న‌తార జీవిత విశేషాల‌పై ఓ డాక్యుమెంట‌రీ తెర‌కెక్కించింది. ఈనెల 18న నెట్ ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంట‌రీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ‘నానుమ్ రౌడీ దాన్‌’ (తెలుగులో నేనూ రౌడీనే) సినిమా స‌మ‌యంలో తీసిన 3 సెక‌న్ల వీడియో క్లిప్ ఉప‌యోగించారు.. అయితే ఈ సినిమాకు ధ‌నుష్ నిర్మాత‌.

తన అనుమతి లేకుండా తన సినిమాకు సంబంధించిన క్లిప్స్ ఉపయోగించడం పట్ల ధనుష్ సీరియ‌స్‌ అయ్యాడు. వాస్తవానికి అంతకుముందు ఈ సినిమాకు సంబంధించి కొన్ని నిమిషాల సీన్లను వాడుకున్నారు. ధనుష్ నుంచి ఎన్ఓసీ కాపీ రాలేదు. చివరకు మొబైల్ ఫోన్లో తీసిన మూడు సెకన్ల క్లిప్ వాడుకోవటం పట్ల కూడా ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్ కింద తనకు పది కోట్లు చెల్లించాలని నోటీసులు పంపాడు. ధనుష్ - నయనతార మధ్య రాజీ కుదరచడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. న‌య‌న్ కూడా ధనుష్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది.. ధనుష్ వినలేదు. దీంతో నయనతార కోపం కట్టలు తెంచుకుంది. అందుకే సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.

కేవలం మూడు సెకన్ వీడియో కోసం పది కోట్లు డిమాండ్ చేయటం దారుణం. ధనుష్ ఇంతగా దిగజారాల్చిన అవసరం లేదు.. కేవలం పాత కక్షలు కోపాలను దృష్టిలో ఉంచుకుని ధనుష్ ఈ పని చేశాడు.. లోపల ఒకలా కనిపిస్తాడని ఇతరులు ఎదిగితే సహించలేడని కాస్త ఘాటుగానే విమర్శలు చేసింది. ధనుష్‌కు మనసాక్షి లేదని సినిమా విడుదలై 10 ఏళ్లు దాటిపోయినా ఆ సినిమాపై కాపీ రైట్ చట్టం కింద డబ్బులు వసూలు చేయాలని మూడు సెకండ్ల క్లిప్పింగ్ కి ఇన్ని కోట్లు డిమాండ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను రౌడీనే హిట్ అవ్వటం హీరోయిన్గా తనకు మంచి పేరు రావడం చూసి ధనుష్ తట్టుకోలేకపోయాడని.. అత‌డి అహం దెబ్బతిన్నదని.. 2016 ఫిలిం అవార్డుల సమయంలోనే తన అక్కకు బయట పెట్టుకున్నాడని వాపోయింది.

10 ఏళ్ల నుంచి ఆ కోపాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు బయటపడ్డాడని ఆమె ఆరోపించింది. తమిళనాడు ప్రజలు ఇదంతా చూస్తూనే ఉన్నారని.. వాళ్ళు అప్పటికి దీనిని సహించారని తన లేఖలో రాజుకు వచ్చింది. న‌య‌న్ రాసిన సుదీర్ఘమైన ఉత్తరాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థమయ్యేది ఒక్కటే వీరిద్దరి మధ్య పాత గొడవలు చాలా ఉన్నాయి. వాటిని మనసులో పెట్టుకుని ధనుష్ ఏకంగా మూడు సెక‌న్ల క్లిప్‌కు రు. 10 కోట్లు నష్ట పరిహారం డిమాండ్ చేశాడు. వాళ్ళు అప్పటికి దీనిని సహించారని తన లేఖలో రాసుకు వచ్చింది. న‌య‌న్ రాసిన సుదీర్ఘమైన ఉత్తరాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థమయ్యేది ఒక్కటే.. వీరిద్దరి మధ్య పాత గొడవలు చాలా ఉన్నాయి. వాటిని మనసులో పెట్టుకుని ధనుష్ ఏకంగా మూడు సెక‌న్ల‌కు రు. 10 కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: