మెగా హీరోలకి ఏమైంది.. ఎందుకు వారి సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి అని మెగా ఫ్యాన్స్ అందరూ కలవర పడుతున్నారు.మరి ఇంతకీ మెగా ఫ్యామిలీకి ఏ పేరు శాపంగా మారింది అనేది ఇప్పుడు చూద్దాం.. మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తర్వాత నాగబాబు,పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్,రామ్ చరణ్,వరుణ్ తేజ్,వైష్ణవ్ తేజ్,సాయి ధరంతేజ్,అల్లు శిరీష్ వంటి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరు మెగా ఫ్యామిలీ నుండి వేరుపడి అల్లు ట్యాగ్ తోనే ముందుకు వెళ్తున్నారు. కానీ మిగిలిన హీరోలందరూ మెగా ట్యాగ్ ని ఉపయోగించుకుంటున్నారు. చాలామంది మెగా అనే ట్యాగ్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకుంటారు. కానీ మెగా అనే ట్యాగే వారి పాలిట శాపంగా మారుతుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఈ మధ్యకాలంలో చేసిన హీరోల సినిమాలన్నీ ఫ్లాపే..
అలా చిరంజీవి చేసిన గాడ్ ఫాదర్ సినిమా అంతంతమాత్రంగానే హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆచార్య, భోళా శంకర్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అలాగే రామ్ చరణ్ చేసిన వినయ విధేయ రామ అట్టర్ ప్లాప్. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్.. ఇక త్వరలో విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమాపై కూడా మెగా ఫ్యాన్స్ కి అంతగా అంచనాలు లేవు.ఇక సాయి ధరంతేజ్ కెరీర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. అలాగే వైష్ణవ్ తేజ్ సినీ కెరియర్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఉప్పెన సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా హిట్ అవ్వలేదు.
అలాగే వరుణ్ తేజ్ అయితే ఒక్క హిట్టు కోసం పడితే చాలు అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.ఇక రీసెంట్గా విడుదలైన మట్కా మూవీ పెద్ద దెబ్బ కొట్టింది. అలాగే ఆపరేషన్ వాలెంటైన్,గాండీవ ధార అర్జున మూవీలు రెండు కూడా అట్టర్ ప్లాఫ్..అసలు ఈ సినిమాలు ఉన్నాయి అని కూడా ఎవరికీ గుర్తుండడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో కూడా చెప్పడం కష్టంగా మారింది.అలా మెగా హీరోలందరికీ మెగా అనే ట్యాగ్ ఉంటే హిట్ అవుతుంది అనుకున్నప్పటికీ మెగా అనే ట్యాగే వారి పాలిట శాపంగా మారుతుంది అని నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు