తారక్ లాంటి స్టార్ హీరో ఈ పిచ్చి సెంటిమెంట్ కూడా ఫాలో అవుతూ ఉంటాడా.. వెరీ ఫన్నీ..!

Thota Jaya Madhuri
జూనియర్ ఎన్టీఆర్ ఒక పెద్ద హీరో .. పాన్ ఇండియా హీరో.. బడా హీరో .. ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరో . తారక్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉంటారా..? నో వే. ఇష్టం లేని వాళ్ల గురించి మనం మాట్లాడుకోవట్లేదు . ఇష్టం ఉన్న వాళ్ల గురించే మనం మాట్లాడుకుంటున్నాం . పాన్ ఇండియా రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తారక్ కి అనే చెప్పాలి.  తారక్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆయనను ఇష్ట పడే  అందరూ కూడా ఆయనను సొంత నటన చూసే ఇష్టపడ్డారు .. కానీ ఎక్కడ నందమూరి ట్యాగ్ అన్న  బ్యాక్ గ్రౌండ్ చూసి ఇష్టపడలేదు .


ఆ విషయం అందరికీ తెలిసిందే.  తారక్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. నచ్చితే నచ్చింది అని చెప్తాడు .. నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాడు.  ఉన్న విషయాన్ని ముఖాన్నే మాట్లాడేసేయడం తారక్ దగ్గర నుంచి వచ్చింది . అయితే తారక్ కొన్ని కొన్ని సెంటిమెంట్స్ కూడా ఫాలో అవుతూ ఉంటాడట.  అయితే ఈ మధ్యకాలంలో జనాలు యువత ఏ సెంటిమెంట్స్ కూడా ఫాలో అవ్వడం లేదు . పెద్దలు చెప్పిన విషయాని అస్సలు పట్టించుకోవడం లేదు. అది అందరికీ తెలుసు . కోట్ల ఆస్తి ఉన్న కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తారక్ మాత్రం కొన్ని కొన్ని చిన్న సెంటిమెంట్స్ కూడా బాగా ఫాలో అవుతూ ఉంటాడట .


మరి ముఖ్యంగా అది తన తల్లి దగ్గర నుంచి నేర్చుకున్నారట . సినిమా షూట్ కి కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా తుమ్మితే మళ్ళీ ఇంట్లోకి వెళ్లి కాసేపు కూర్చొని మంచినీళ్లు తాగి నాన్న ఫోటోకి దండం పెట్టుకుని బయటకు వస్తాడట.  అంతేకాదు తారక్ కి మరొక సెంటిమెంట్ కూడా ఉందట . తారక్ ఇంటి వద్ద ఏదైనా కాకి వచ్చి అరుస్తున్నప్పుడు.. అది తన పితృదేవతలతో  సమానం అంటూ ఆ కాకికి ఫుడ్ పెడుతూ ఉంటారట.  సాధారణంగా సామాన్య జనాలు ఇలా చేస్తూ ఉంటారు . పెద్ద పెద్ద స్టార్ సెలబ్రిటీస్ ఏమాత్రం పట్టించుకోరు . కానీ తారక్ కి పాన్ ఇండియా లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా..ఈ హీరో ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాడు అని తెలిసి జనాల షాక్ అయిపోతున్నారు. మరి కొందరు ఆయన కూడా మనిషేగా అంటుంటే మరికొందరు వెరీ ఫన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: