వైరల్ అవుతున్న చైతన్య శోభిత వెడ్డింగ్ కార్డ్.. ఆ జాగ్రత్తలు తీసుకున్నారుగా!
చాలా సింపుల్ గా ఈ కార్డ్ ఉండగా ఈ కార్డ్ లో నాగార్జున అమల పేర్లతో నాగచైతన్య తల్లి లక్ష్మి, ఆమె భర్త పేర్లు కూడా ఉండటం గమనార్హం. పిల్లలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పి నాగచైతన్య తాజాగా వెల్లడించారు. డిసెంబర్ నెల 4వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో వివాహం జరగనుండగా వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డును చూసి నందమూరి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.
వెడ్డింగ్ కార్డ్ సింపుల్ గా డిజైన్ చేయడంతో పాటు ఎలాంటి విమర్శలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చైతన్య శోభిత పెళ్లి చేసుకుని కలకాలం సంతోషంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చైతన్య శోభిత పెళ్లి తర్వాత కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. చైతన్య రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ బ్యానర్లలో చైతన్య నటిస్తుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శోభిత ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను మాత్రం వేగంగా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. చైతన్య క్లాస్ సినిమాలతో మెజారిటీ సందర్భాల్లో విజయాలను సొంతం చేసుకోవడం గమనార్హం. తండేల్ సినిమా ప్రమోషన్స్ 2025 జనవరి నుంచి మొదలవుతాయని సమాచారం అందుతోంది. నాగ చైతన్య శోభితల పెళ్లి వేడుకకు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.