జక్కన్న సినిమాలలో కామన్ పాయింట్ ఇదే.. తీసిందే తీసి హిట్ సాధించారా?

Reddy P Rajasekhar
స్టార్ డైరెక్టర్ రాజమౌళి కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి కెరీర్ లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన మగధీర, ఈగ, బాహుబలి సినిమాలను చూస్తే మాత్రం ఒక కామన్ పాయింట్ ను గమనించవచ్చు. ఈ మూడు సినిమాలలో విలన్ హీరోయిన్ పై మనసు పడతాడు.
 
అయితే ప్రతీకారం తీర్చుకునే విధానం మాత్రం ఒక్కో సినిమాలో ఒక్కోలా ఉంటుంది. జక్కన్న తీసిందే తీసి సక్సెస్ సాధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్క్రిప్ట్ సెలక్షన్ లో జక్కన్న రూటే సపరేట్ అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.
 
స్టార్ డైరెక్టర్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ దర్శకుడు నత్తనడకన సినిమాలను తెరకెక్కించడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ జక్కన్న 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. రాజమౌళి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
 
మహేష్ రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్లు అని బిజినెస్ 2000 కోట్ల రూపాయలు అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే సినిమా రిలీజ్ కు చాలా సమయం పట్టే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అప్పటికి పరిస్థితులు ఏ విధంగా మారిపోతాయో చూడాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఇండస్ట్రీని షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ ఎన్ని భాషల్లో థియేటర్లలో విడుదలవుతుందో చూడాల్సి ఉంది. మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. సూపర్ స్టార్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: