ఆ హీరో ఫ్యాన్స్ పై జ్యోతిక ఫైర్.. నా భర్తని కావాలనే తొక్కేస్తున్నారంటూ ..?

Pandrala Sravanthi
చాలామంది తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరోలు తెలుగులో కూడా మంచి గుర్తింపు పొందారు. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో సూర్య. ఈయన సినిమాలు అంటే ఎంతో మంది ఇష్టపడతారు.  అలాంటి సూర్య హీరోగా వచ్చినటువంటి తాజా చిత్రం కంగువా.. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినటువంటి ఈ మూవీ  నెగిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది.. అలాంటి ఈ మూవీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు..  అయితే దీనిపై కొంతమంది రివ్యూవర్స్ సినిమా అసలు బాగాలేదని సౌండ్ తప్ప ఏం లేదని రివ్యూ ఇచ్చారు..  అలాంటి ఈ కంగువా సినిమాపై తాజాగా నటి జ్యోతిక స్పందించి అనూహ్యమైన కామెంట్లు చేసింది.. 

కావాలనే సినిమాను ఇలా చేస్తున్నారని ఆమె అన్నది.  
జ్యోతిక కామెంట్లు చేసిన తరుణంలో ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది..ఒక తమిళ స్టార్ హీరో  కావాలని ఈ సినిమాపై నెగటివ్ స్ప్రెడ్ చేయిస్తున్నారని, అంతేకాకుండా  తన ఫ్యాన్స్ తో నెగిటివ్ విషయాలను సోషల్ మీడియా వేదిక చేసుకుని స్ప్రెడ్ చేస్తున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.  ఆ హీరో ఎవరనేది బయటకు రాలేదు కానీ ఆ హీరోకు సూర్య అంటే అసలు పడదట.డబ్బులు ఇచ్చి మరీ ఆ హీరో సూర్య సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని  చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఆ హీరోకి సూర్య అంటే ఎందుకు అంత కక్షో మాత్రం తెలియట్లేదు. 

ఎలాగైనా సూర్యను తొక్కేయాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారని, అందుకే తన సినిమాపై వాళ్ల అభిమానులతో   తప్పుడు విషయాన్ని బయటకు స్ప్రెడ్ అయ్యేలా చేస్తున్నారని  సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది..  ఏది ఏమైనా సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం అభిమానులకు దగ్గరవుతుందనేది జగమెరిగిన సత్యం.. మరి చూడాలి  కంగువా సినిమా ఇంత నెగిటివ్ మధ్య హిట్ అయితే మాత్రం, సూర్యాపై కక్ష గట్టిన వారికి చెంపపెట్టు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: