సీనియర్ బ్యూటీ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందం అభినయంతో ఆకట్టుకున్న స్నేహ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ ,కన్నడ ,మలయాళంలో సైతం వరుస సినిమాలలో నటించి మెప్పించింది.తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న స్నేహ ఫ్యామిలీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇదిలా ఉంటే హీరోయిన్ గా స్నేహ కెరీర్ ఆసక్తికరంగా మొదలైంది.స్నేహ అసలు పేరు సుహాసిని..1981 అక్టోబర్ 12 న రాజారామ్ నాయుడు ,పద్మావతి దంపతులకు సుహాసిని అలియాస్ స్నేహ జన్మించింది.స్నేహకి ఒక అక్క ఇద్దరు సోదరులు వున్నారు .స్నేహ పుట్టాక వారి కుటుంబం అంతా కూడా యూఏఈ లోని షార్జా కు షిఫ్ట్ అయ్యారు.. ఆమె స్కూలింగ్, కాలేజీ చదువు అంతా అక్కడే జరిగింది.. ఒకనాడు మాలయాళీ దర్శకుడు ఫాజిల్ నయీమ్ గారు షార్జాలోని ఒక ఫంక్షన్ లో స్నేహాను చూసాడు..సినిమాలలో పనికొస్తుందని ఆమె గురించి వివరాలన్నీ తెలుసుకున్నాడు.స్నేహ అమ్మగారిని కలిసిన ఆ దర్శకుడు సినిమాలలో నటించే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించమని ఆమెను అడిగాడు.ఆ సమయంలో స్నేహ ఇంటర్ పూర్తి చేసింది ..
అదే సమయంలో మలయాళీ దర్శకుడు అనిల్ కుమార్ బాబు తాను తీయబోయే సినిమా కోసం హీరోయిన్ గా కొత్త అమ్మాయి కోసం వెతుకున్నాడు.ఆ విషయం తెలుసుకున్న ఫాజిల్ గారు ఆయనకు స్నేహ గురించి చెప్పారు.అనిల్ గారు వెంటనే షార్జాలోని స్నేహతో కాంటాక్ట్ అయి ఆమె అమ్మా,నాన్నలతో ఈ విషయం చెప్పి ఒప్పించారు.స్నేహ కూడా నటన మీద ఇష్టంతో నటించడానికి ఒప్పుకుంది.డాన్స్ కూడా నేర్చుకుంది.ఆ తరువాత దుబాయ్ నుండి నేరుగా తమిళనాడు వచ్చిన స్నేహ కుటుంబం చెన్నై లోని కుంభకోణం హైవే వద్ద స్నేహ మహల్ అనే మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కొన్నారు.ఆ తరువాత స్నేహని తీసుకోని దర్శకుడు అనిల్ కుమార్ వద్దకు వెళ్లిన స్నేహ తండ్రి దర్శకుడు అనిల్ కుమార్ తో సినిమాకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకుంటారు.అలా స్నేహ నటించిన మొదటి సినిమానే “ఎంగెనా ఒరు నీల పక్షి”.. ఆ సినిమా దర్శకుడు అనిల్ కుమార్ బాబు సుహాసినిగా వున్న ఆమె పేరును మార్చమని చెప్పగా అప్పుడు వారుకొన్న స్నేహ మాల్ పేరును సుహాసిని స్క్రీన్ నేమ్ గా మార్చడం జరిగింది.. అప్పటి నుంచి సుహాసినీ స్నేహగా మారింది.. అలా స్నేహ తన స్క్రీన్ నేమ్ తో పాపులర్ అయింది.. ఆ సినిమాతో మొదలైనా స్నేహ సినీ ప్రయాణం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో వరుసగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది..