టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే నటించిన తక్కువ సినిమాలతోనే మంచి విజయాలు దక్కుతూ ఉంటాయి. దానితో వారు మంచి స్థాయికి వెళుతూ ఉంటారు. కానీ కొంత మంది మాత్రం అందం , అభినయం , నటన అన్ని ఉన్నా కూడా విజయాలు లేకపోవడంతో అవకాశాలను దక్కించుకోలేక తక్కువ కాలంలోనే కెరీర్ ను ముగిస్తూ ఉంటారు. అలాంటి వారిలో అదితి శర్మ ఒకరు. ఈ
బ్యూటీ 2008 వ సంవత్సరం విడుదల అయిన
గుండె ఝల్లుమంది అనే సినిమాతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఉదయ్ కిరణ్ ఈ
మూవీ లో
హీరో గా నటించాడు.
ఇకపోతే 2014 వ సంవత్సరం ఈమె
బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన సర్వర్ అహుజా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇక వీరికి
2019 వ సంవత్సరం ఒక కుమారుడు జన్మించాడు. ఇక
పెళ్లి తర్వాత ఈమె కేవలం
పంజాబీ సినిమాల్లో మాత్రమే నటించింది. ఈమె ప్రస్తుతం పాలు
టీవీ షోలలో కూడా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఈమె తన భర్తకు సంబంధించిన బిజినెస్లను కూడా దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.