తెలుగులో హైయెస్ట్ లాభాలను అందుకున్న డబ్బింగ్ మూవీలు ఇవే.. అమరన్ ప్లేస్ అదే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక లాభాలను అందుకున్న టాప్ 4 డబ్బింగ్ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
జైలర్ : సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ లాభాలను అందుకుంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ టోటల్ బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి 35.90 కోట్ల లాభాలను అందుకుంది.
కాంతారా : రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 27.65 కోట్ల లాభాలను అందుకుంది. ఈ మూవీ లో సప్తమి గౌడ హీరోయిన్గా నటించింది.
బిచ్చగాడు : విజయ్ ఆంటోనీ హీరోగా రూపొందిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం 50 లక్షల ఫ్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. ఇక ఈ సినిమా ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.30 కోట్ల లాభాలను అందుకుంది. ఈ మూవీ కంటే ముందు విజయ్ ఆంటోనీ కి తెలుగులో పెద్దగా గుర్తింపు లేదు. ఈ సినిమాతో ఈ నటుడికి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెలుగు లభించింది.
అమరన్ : శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం అక్టోబర్ 31 వ తేదీన విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... కేవలం 17 రోజుల్లోనే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 16.30 కోట్ల లాభాలను అందుకుంది. ఇప్పటికే ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత లాభాలను అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: