సినిమా ఇండస్ట్రీ లో ఒకరితో అనుకున్నా సినిమాను మరొకరితో చేయడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం ఒక దర్శకుడు ఒక కథ తయారు అయిన తర్వాత దానిని ఒకరితో చేయాలి అనుకోవడం , అందులో భాగంగా ఆయనను సంప్రదించిన సమయంలో ఆ నటుడికి కథ నచ్చకనో లేక ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వలనో , మరే ఇతర కారణాల వల్లనో కొన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ కథను దర్శకులు పక్కన పెట్టేయకుండా చాలా వరకు వేరే వారితో చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఉన్నాయి.
ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొన్ని సంవత్సరాలు క్రితం టాప్ డైరెక్టర్లు ఒకరిగా కెరియర్ను కొనసాగించిన వారిలో ఎస్ వి కృష్ణా రెడ్డి ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం ఆలీ హీరోగా ఇంద్రజ హీరోయిన్ గా యమలీల అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఈ మూవీ తో ఆలీ కి ఎస్ వి కృష్ణా రెడ్డి కి గొప్ప గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాను మొదట ఎస్ వి కృష్ణా రెడ్డి ఆలీ తో కాకుండా మహేష్ బాబు తో చేయాలి అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదట.
దానితో ఎస్ వి కృష్ణా రెడ్డి , ఆలీ తో ఈ సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఎస్ వి కృష్ణా రెడ్డి ఈ సినిమాకు సంగీతాన్ని కూడా అందించాడు. ఈయన దర్శకత్వం మాత్రమే కాకుండా ఈయన ఈ సినిమాకు అందించిన సంగీతం కూడా ఈ మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది.