ఈ మధ్యకాలంలో చిన్న హీరోలు ఏ మాటలు మాట్లాడినా కూడా అవి వివాదాస్పదంగా మారుతున్నాయి.రీసెంట్గా ఐఫా అవార్డ్స్ వేదికపై హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జా చేసిన కామెంట్లు స్టార్ హీరోలను కించపరిచేలా ఉన్నాయని హీరోల అభిమానులు తేజ సజ్జాపై ట్రోలింగ్ చేశారు. అయితే తాజాగా విశ్వక్సేన్ తన మెకానిక్ రాఖీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం వివాదానికి దారితీసాయి.ఇక అసలు విషయం ఏమిటంటే.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్ సంచలనాలు సృష్టించింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే మిలియన్ వ్యూస్ ని అందుకొని స్టార్ హీరోల రికార్డులను బ్రేక్ చేస్తుంది. అయితే గతంలో అంటే పుష్ప వన్ విడుదల సమయంలో అల్లు అర్జున్ ఈ సినిమా బాగా లేకపోతే నేను షర్టు విప్పేసి తిరుగుతా అంటూ మాట్లాడారు.
కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో అల్లు అర్జున్ కి ఆ పరిస్థితి రాలేదు. ఇక తాజాగా యంగ్ హీరో విశ్వక్సేన్ తన మెకానిక్ రాఖి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ..ఎంతమంది క్రిటిక్స్,రివ్యూవర్లు ఎన్నివార్తలు రాసిన నాకు సంబంధం లేదు.. నాకు వారిపై చిన్న చూపు లేదు.అయితే మీరు రాసే దాంట్లో నిజం ఉండాలి.ఒకవేళ మీరు రాసే వార్తలు అవాస్తమైతే వాటిపై స్పందించే హక్కు ఉంది. ఒకవేళ పర్సనల్‌గా అటాక్ చేస్తే మాత్రం వేరేలా ఉంటుంది కోపం ఖచ్చితంగా వస్తుంది అంటూ విశ్వక్సేన్ మాట్లాడారు. అంతేకాదు అక్కడే ఉన్న ఆడియన్స్ తో మాట్లాడుతూ మీకు చాలెంజ్ కావాలా నేను మొన్ననే మెకానిక్ రాఖీ సినిమా చూశాను.
చాలా బాగుంది.ఒకవేళ సినిమా బాగోలేకపోతే నేను ఇల్లు అమ్మేసుకొని వెళ్తాను. ఒంటి మీద షర్టు వేసుకోను అనే పెద్ద పెద్ద డైలాగులు చెప్పను.ఎందుకంటే నా సినిమా ఆడిన ఆడకపోయినా నేను నా ఇంట్లోనే ఉంటాను. నా షర్ట్ నా బాడీ పైనే ఉంటుంది. ఇలాంటి విషయాలు నేను చెప్పను అంటూ విశ్వక్ సేన్ మాట్లాడడం ప్రస్తుతం వివాదాస్పదమైంది.ఎందుకంటే పుష్ప వన్ విడుదల సమయంలో అల్లు అర్జున్ సినిమా బాగోలేకపోతే షర్టు విప్పేసి తిరుగుతాను అని మాట్లాడిన మాటలకు కౌంటర్‌గా విశ్వక్సేన్ మెకానిక్ రాఖీ ఈవెంట్లో మాట్లాడినట్టు పలువురు నెటిజన్స్ అప్పటి వీడియోని ఇప్పటి వీడియోని కలిపి వైరల్ చేస్తున్నారు