బాహుబలి 2 కన్నా పుష్ప 2కే ఎందుకు క్రేజ్ ఎక్కువ... ?
ఏడేళ్ల క్రితం బాహుబలి-2 రిలీజ్ కోసం దేశం అంతా ఎదురు చూసింది.. మళ్ళీ ఇప్పుడు పుష్ప-2 రిలీజ్ కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.. బాహుబలికి రాజమౌళి మెయిన్ అసెట్.. బాహుబలిని కట్టప్ప ఎందుకు ? చంపాడు అనే పాయింట్ లాక్ చెయ్యడం ద్వారా బాహుబలి -2 సినిమా చూడాలనే ఉత్సుకత అందరిలో క్రియేట్ చెయ్యగలిగాడు.. కానీ పుష్ప-2 కి డైరెక్టర్ కన్నా అల్లు అర్జున్ అసలైన అసెట్.. "తగ్గేదే లే" అనే తన క్యారెక్టర్ మ్యానరిజం ద్వారా సినిమాకి ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చెయ్యగలిగాడు. ఒక తెలుగు సినిమా కోసం, తెలుగు నటుడి యాక్టింగ్ కోసం దేశం అంతా ఎదురు చూస్తుంది అంటే తెలుగువారిగా మనమంతా గర్వ పడాల్సిన విషయం.
ఇందులో మరో ఆలోచనకు తావు లేకుండా సినిమా పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుందాం.. అతనికి పొగరు కాబట్టి సినిమా ఫ్లాప్ అవ్వాలని కొందరు కోరుకుంటున్నారు.. అయితే ఇప్పుడు ఈ టైంలో ఇది అనవసరం.. నెంబర్ 1 పొజిషన్ కి వెళ్ళడం ఒక ఎత్తైతే దానిని నిలబెట్టుకోవడం మరో ఎత్తు.. వినయం, విధేయత, క్యారెక్టర్ లేకపోతే ఎంత ఎత్తుకి ఎదిగినా కింద పడాల్సిందే.. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే బయటకు ఎన్ని అనుకున్నా మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే.. వారిలో అల్లు అర్జున్ సెపరేట్ కాదు అన్నది మెగాభిమానులే కాదు.. ప్రతి ఒక్క తెలుగు సినిమా అభిమాని.. తెలుగు ప్రజలు తెలుసు కోవాలి.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న విషయం అప్పుడే మర్చిపోతే ఎలా.! అదంతా పక్కన పెడితే దేశ స్థాయిలో మార్మోగుతున్న మన తెలుగు సినిమా పుష్ప-2 సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి మనమందరం రెడీగా ఉండాలి.. ఒక వేళ మనం ఎన్ని చెప్పుకున్నా సినిమా బాగోకపోతే అదే ఫ్లాప్ అవుతుంది.