అక్కినేని నాగేశ్వరరావును నవ్వుల పాలు చేసిన చిరంజీవి.. దెబ్బకు సినిమాలో నటించడం మానేశారుగా..!

Amruth kumar
ఏడుపదుల వయసు దాటిన‌ కూడా మన సీనియర్ స్టార్ హీరోలు ఏదో ఒక సినిమాలో నటించి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ కంటే ముందే చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టి స్టార్ హీరో గా ఏదైనా అక్కినేని నాగేశ్వరరావు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. 60 ఏళ్లు దాటిన తర్వాత ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ హీరోలు గా పలు సినిమాలు చేసిన .. నాగేశ్వరరావు మాత్రం ఎప్పుడు ఎలాంటి పాత్ర వచ్చిన నటించాలనే ఉద్దేశంతో ముందుగానే తన వయసుకు సరిపడా పాత్రల కోసం చూసేవారు .

ఇక వారి తర్వాత తరం హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ వీరు కూడా స్టార్ హీరోలుగా మారిన తర్వాత ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ కూడా వారి సినిమాల్లో గెస్ట్ రోల్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇదే సమయంలో 1993 లో మోహన్ బాబు నిర్మాత గా హీరో గా , రాఘవేంద్రరావు దర్శకత్వం లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ టైటిల్ రోల్ లో నటించారు . ఆ సినిమా రిలీజ్ అయి అప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది .. ఆ తర్వాత అదే సంవత్సరం చిరంజీవి - అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన మెకానిక్ అల్లుడు సినిమా రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి .

ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు , చిరంజీవి తో పాటు ముఖ్యమైన పాత్రలో నటించాడు . అంతేకాకుండా ఈ సినిమాలో చిరంజీవితో పాటు నాగేశ్వరరావు గురువా గురువా అనే పాటలో మెగాస్టార్ కి పోటీగా డాన్స్ చేశారు .  లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరోయిన్ గా నటించింది . బి గోపాల్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా 1997 మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ గా మిగిలింది . ఈ సినిమాతో ఏఎన్నార్ ఒక్కసారిగా విమర్శల పాలయ్యారు . ఆ తర్వాత నాగేశ్వరరావు ఇతర హీరోలతో సినిమాలు చేయడం మానేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: