భారతీయ సినిమా చరిత్రలోనే థియేటర్ లోపల కూర్చోబెట్టి టికెట్లు ఇచ్చిన సినిమా .. ఆ రికార్డు బాలయ్యకే సాధ్యం..!
బి . గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడు 2001 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అలాగే ఈ సినిమాకు పోటీగా చిరంజీవి నటించిన మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.. ఈ రెండు సినిమాలను కూడా పక్కకినట్టి బాలయ్య నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 105 సెంటర్లో 100 రోజులకు పైగా పైగా ఆడి బాలయ్య కెరియర్లని ఓ గొప్ప మైలురాయిగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఫ్యాక్షన్ సినిమాలే రాజ్యమేలాయి.
ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణం ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మణిశర్మ ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన చిన్నకృష్ణ. ఈ సినిమాలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే ఎంతో హైలెట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ తను 109వ సినిమా డాకు మహారాజ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు .. ఇక ఈ సినిమాని కూడా వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య.. సినిమాతో కూడా మరో బ్లాక్ బస్టర్ హీట్ కొట్టబోతున్నాడు. ఇలా బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు.