నీ మొహానికి సినిమాలెందుకు మానేయ్ అంటూ నయనతారని అవమానించిన హీరో.?

Pandrala Sravanthi
నయనతార.. తెలుగు తమిళ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఆమెకు ఇంతటి స్టార్డం ఈజీగా అయితే రాలేదు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. అలాంటి నయనతార జర్నీ పై  సంస్థ డాక్యుమెంటరీ చేశారు. అది ఇప్పటికే రిలీజ్ అయింది. ఈ డాక్యుమెంటరీలో తన సినిమాలు, ప్రేమ,పెళ్లి, కుటుంబం ఇలా అనేక విషయాలను పొందుపరిచారు..  అయితే ఈ సందర్భంగా నయనతార అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొన్నటువంటి కొన్ని విషయాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఆ వివరాలు ఏంటో చూద్దాం.. నయనతార శ్రీరామరాజ్యం అనే చిత్రంలో సీత పాత్ర చేసిన విషయం అందరికీ తెలుసు. అయితే ఈ టైంలో ఆమెపై విపరీతమైనటువంటి విమర్శలు వచ్చాయట.  ఆ పాత్ర నయనతార చేయకూడదని దారుణంగా గొడవలు కూడా చేశారట. 

కానీ ఆ టైంలో నయనతార  ఇలాంటి నిర్ణయాలు తీసుకుందో తెలియజేశారు..  ఈ పాత్ర చేసే సమయంలో నయనతార షూటింగ్ ఉన్నన్ని రోజులు పూర్తిగా నాన్ వెజ్ మానేసి వెజ్ మాత్రమే తింటూ నిష్టగా ఉందట..  అలా ఎంతమంది విమర్శలు చేసినా నేను ఆ సినిమా షూటింగులో పాల్గొని లాస్ట్ డే చాలా ఎమోషనల్ అయ్యాననింటూ నయనతార చెప్పుకొచ్చింది.. అయితే బయట వారు చేసిన విమర్శలకు నేను ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీకి  గుడ్ బై చెబుదామని అనుకొని చివరికి సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చేశాను.. అంతేకాదు ఓ హీరో నువ్వు సినిమాలకు సెట్ అవ్వవు ఇండస్ట్రీ నుండి వెళ్ళిపో అని అవమానించారు..

కానీ ఆ వ్యక్తులకు నేను భయపడి సినిమాలు పూర్తిగా మానేస్తే వారి ముందు చులకన అవుతానని భావించి , ఎవరైతే మనల్ని అవమానించారో వారు అసూయ పడేలా ఎదగాలని అనుకున్నాను.. ఈ టైంలోనే నాకు  దేవుడిలా నాగార్జున కాల్ చేసి మా సినిమాలో ఒక పాత్ర ఉంది. అది నువ్వైతే బాగా చేస్తావని చెప్పారు. దీంతో ఆ సినిమాకు ఓకే చెప్పాను అని తెలియజేసింది. అలా నాగార్జున ద్వారా మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసిన నయనతార  ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతేకాదు ఆమె చేసిన శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు  ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా దక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: