బన్నీ ఎదుగుదల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అతనే.. ఎవరో అస్సలు ఊహించలేరు!

Reddy P Rajasekhar
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో బన్నీకి బాక్సాఫీస్ వద్ద ఒకింత షాకింగ్ ఫలితం ఎదురైంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత బన్నీ తనను తాను సమీక్షించుకున్నారు. వరుస విజయాలు సాధించే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే బన్నీ ఎదుగుదల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది. ఆయన ఎవరో కాదు అల్లు అరవింద్ కావడం గమనార్హం.
 
పుష్ప2 ట్రైలర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడం వెనుక అల్లు అరవింద్ ప్లానింగ్ ఉందని తెలుస్తోంది. ఒకప్పుడు చిరంజీవి విషయంలో కీలకంగా వ్యవహరించిన అల్లు అరవింద్ ప్రస్తుతం బన్నీ కెరీర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారని సమాచారం అందుతోంది. బన్నీకి అల్లు అరవింద్ చెప్పిన సూచనలు పూర్తిస్థాయిలో హెల్ప్ అవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అల్లు అరవింద్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలను నిర్మిస్తున్నారనే సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ ప్రస్తుతం తండేల్ సినిమా నిర్మాణంతో బిజీగా ఉన్నారు. తండేల్ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నెల మొదటి వారం విడుదల కానుందనే సంగతి తెలిసిందే. తండేల్ సినిమాలో అదిరిపోయే ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం అందుతోంది.
 
బన్నీ పుష్ప ది రూల్ మూవీతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో అనే చర్చ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. పుష్ప ది రూల్ మూవీ ఆరు భాషల్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ మూవీ బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ బిజినెస్ తో నిర్మాతలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. పుష్ప ది రూల్ మూవీ రష్మిక రేంజ్ ను మరింత పెంచడం పక్కా అని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ మూవీ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని చెప్పవచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: