వరుస సినిమాల హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య బాబు తన 109వ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి అదిరిపోయే మాస్ సినిమా అని హింట్ ఇచ్చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు.డాకు మహారాజ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ 2 తాండవం సెట్స్‌లో సందడి చేయనున్నాడు. బాలయ్య - బోయపాటి పెయిర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే గతంలో బాలయ్య ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తన మనవళ్ల గురించి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. ఓ ఈవెంట్లో స్టేజ్ పైకి యాంకర్ వచ్చి బాలయ్యను మామయ్య అని పిలవచ్చా అంటూ అడిగగా బాలయ్య తనదైన స్టైల్ లో రియాక్ట్ అవుతూ నా మనవళ్లే నన్ను తాతయ్య అని పిలవరు నువ్వు మావయ్య అని పిలుస్తావా అంటూ కామెంట్స్ చేశాడు. అప్పుడు యాంకర్ మీ మనవళ్ళు ఏమని పిలుస్తారు అని ప్రశ్నించగా.. బాల అని ముద్దు ముద్దుగా పిలుస్తారు అంటూ వివరించారు. బాలకృష్ణ చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా వైరల్ అవుతుంది.ఈ నేపథ్యంలో సినిమాలే కాకుండా.. మరో పక్కన అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ అవతారం ఎత్తి తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 4ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత మూడు సీజన్లలో కంటే.. ఈ సీజన్ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని నెలకొల్పుతుంది.