గంగవ్వ స్టేజ్ మీదకి ఎందుకు వెళ్ళలేదు.. అసలు విషయం చెప్పేసిందిగా?
అయితే ఇలా హౌస్ నుంచి బయటికి వచ్చిన గంగవ్వను కనీసం అటు స్టేజి మీదకి కూడా పిలవలేదు నాగార్జున. దీంతో ఏదో వివాదం జరగడం కారణంగానే బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వను స్టేజి మీదకి పిలవలేదు అంటూ ప్రచారం జరుగుతుంది. ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ.. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. బిగ్ బాస్ నుండి మళ్ళీ అవకాశం రావడంతో హౌస్ లోకి వెళ్ళాను. అందరూ నన్ను బాగా చూసుకున్నారు. నాలుగవ సీజన్లో ఫుడ్ బాగుండేది. కానీ ఎనిమిదవ సీజన్లో ఫుడ్ బాగాలేదు. వారానికి సరిపడా ఫుడ్ ఒకేసారి చేసుకోవాలి. మూడు వారాలు బాగానే గడిచింది. దసరా, బతుకమ్మ వేడుకలు కూడా చేసుకున్నాం. మంగ్లీ వచ్చి పాట పాడి వెళ్ళిపోయింది. ఇక దీపావళి పండుగ ముందు అటుకులతో చేసిన పోహా తిన్న. వయసు మీద పడటంతో ఆ పోహా తినడంతో నాకు జీర్ణం కాదు. దాంతో మోషన్స్ మొదలయ్యాయ్. అవినాష్ కి చెబితే సెట్ అవుతుందిలే అవ్వ అన్నాడు. ఇక నాలుగైదు రోజులు పోతే అంత సెట్ అవుతుందని అనుకున్న. కానీ సడన్గా హౌస్ నుంచి బయటకు రమ్మన్నారు. వాస్తవానికి హౌస్ నుంచి బయటకు రావాలని లేదు. ఆరోజు ఫుడ్ బాలేదు. ఒకవేళ అడిగి ఉంటే చిన్న సమస్య కాస్త సెట్ అయ్యేది. మరో నాలుగు రోజులు ఉండి ఉంటే అంత నార్మల్ స్థితికి వచ్చేది. మరో మూడు నాలుగు రోజులు హౌస్ లోనే ఉండాలి అని అనుకున్నాను. కానీ అప్పటికే బయటికి రమ్మని చెప్పారు. ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ నేను వెళ్తూ ఉండడంతో ఎడ్చేశారు. నాకు హౌస్ నుంచి బయటకు రావడం ఇష్టం లేకపోయినా బయటికి పంపించారు. అందుకే నన్ను స్టేజి పైకి తీసుకురాలేదు అంటూ గంగవ్వ అసలు నిజాన్ని బయటపెట్టింది.