లెక్కలేని ఎఫైర్స్.. స్టార్ హీరోకు మించిన రెమ్యూనిరేషన్ ..చివరకు ఇండస్ట్రియే..!

Amruth kumar
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా..? ఈమె పాన్ ఇండియ‌న్ స్టార్ బ్యూటీ. హాలీవుడ్‌ రేంజ్‌కు ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రస్తుతం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. తన లైఫ్ లో ఎన్నో కాంట్రవర్సీ లను, సెన్సేషన్లను ఫేస్‌ చేసింది. తన రియల్ లైఫ్ లోను తనకంటే పదేళ్ల చిన్న వాడిని ప్రేమించి వివాహం చేసుకొని ఎన్నో విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు ప్రియాంక చోప్రా. బీహార్ లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ మోడల్ రంగం ఎంచుకొని ఇండస్ట్రీలోకి వచ్చింది. ప్రియాంక తండ్రి ఓ ఆర్మీ ఆఫీసర్.

 
2002లో తమిళ్ మూవీ తమిళవ్‌తో స్క్రీన్కు పరిచయమైన ప్రియాంక.. హీరో విజయ్ స‌ర‌సన నటించింది. అయితే వెంటనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయినా ఈ ముద్దుగుమ్మ.. తర్వాత సౌత్ సినిమాలో నటించలేదు. కాగా బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిన తర్వాత.. వరుస‌ ఆఫర్లను దక్కించుకున్న ప్రియాంక.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి హిట్లు తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో నటించిన ఏకైక మూవీ జంజీర్. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ ఈ సినిమా సక్సెస్ అందుకోలేదు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న క్రమంలో ప్రియాంక బాలీవుడ్ ను వీడి హాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ బ్యాగ్రౌండ్ అంతా వదిలేసి కొత్త నటిగా ఆడిషన్స్ కి వెళ్లి అవకాశాలను దక్కించుకుని.. తన సత్తా చాటింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం ఒక ప్రాజెక్టు కోసం రూ.14 నుంచి రూ.40 కోట్ల రెమ్యూనరేషన్ అందుకునే స్టేజ్ కి ఎగిరింది.

 
ఫోబ్స్, డిఎన్ఏ లాంటి ప్రముఖ అంతర్జాతీయ మ్యాగ్జన్లో కూడా అమ్మడి గురించి ఎన్నో వార్తలు ప్రచురించబడ్డాయంటే అమ్మడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ప్రియాంక సిటాడాల్ కోసం ఏకంగా రూ.40 కోట్ల రమ్యునరేషన్ తీసుకుందట. మొట్టమొదటిసారి హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకోవడం ఆనందాన్ని కల్పించిందంటూ ప్రియాంక ఓ సందర్భంలో వెల్లడించింది. ఇక ఈ అమ్మ‌డు బాలీవుడ్లో లెక్కకు మించిన ఎఫైర్స్ నడిపింది. షారుక్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ లాంటి ఎంతమంది స్టార్ హీరోస్‌తోను డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. నేనెప్పుడూ ఒంటరిగా లేనని.. ఒక రిలేషన్ ఎండ్ అయితే మరో రిలేషన్ పెట్టుకునేదాన్ని అంటూ స్వయంగా చెప్పుకొచ్చింది. ఇక బాలీవుడ్ తను వదిలేయడానికి కారణం అక్కడ రాజకీయాలు ఎక్కువ అవ్వ‌డ‌మే.. కొందరు నాకు ఆఫర్స్ రాకుండా చేశారు.. వాళ్లతో నాకు గొడవలు అందుకే బాలీవుడ్ లో ఉండలేక హాలీవుడ్కు వచ్చేశా అంటూ ప్రియాంక చోప్రా వివరించింది. ఇక తనకంటే పదేళ్ల చిన్నవాడ హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోన్స్‌ను ప్రియాంక చోప్రా వివాహం చేసుకుంది. ఇక వీళ్లిద్దరు సరోగసి విధానం ద్వారా ఓ పాపకు కూడా జన్మనిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: