నయనతార
ధనుష్ ల మధ్య ప్రస్తుతం వివాదం నడుస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వివాదం ఇలా ఉండగానే
ధనుష్ నటి
రాధిక పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ విషయం రూమర్ కాదు ఎందుకంటే
ధనుష్ తనని ఆ మాట అన్నట్టు రాధికనే స్వయంగా బయటపెట్టిన నిజం.. మరి ఇంతకీ
ధనుష్ కి
రాధిక కి మధ్య గొడవ ఎక్కడ వచ్చింది..రాధికను
ధనుష్ అలా ఎందుకు అన్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
ధనుష్ రాధిక కి మధ్య ఎలాంటి గొడవ లేదు. కానీ తాజాగా నయనతారకు సంబంధించి విడుదలైన డాక్యుమెంటరీలో
రాధిక మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అయితే
నయనతార కి సంబంధించిన డాక్యుమెంటరీలో ఆమె పెళ్లి, ప్రేమ,కెరియర్, ఫస్ట్ లవ్,బ్రేకప్స్,సినిమాల్లోకి ఎలా వచ్చింది? అలాగే తనకు అనుబంధం ఉన్న స్టార్ సెలబ్రిటీల మాటలు కూడా ఈ డాక్యుమెంటరీ లో ఉన్నాయి.
అయితే విజ్ఞేష్ శివన్, నయనతారల బంధం కలిసింది నానుమ్ రౌడీ ధాన్ అనే
సినిమా షూటింగ్లో అని ఇప్పటికే తెలియజేసింది. అయితే ఈ షూటింగ్ సమయంలో
రాధిక కి వీరిద్దరూ డేట్ చేస్తున్న విషయం తెలిసిందట. అది కూడా
ధనుష్ ద్వారా.. అయితే ఈ విషయం గురించి
రాధిక మాట్లాడుతూ.. నాకు ఓ రోజు
ధనుష్ కాల్ చేసి అక్కా నీకు అసలు సిగ్గుందా.. అని టక్కున అన్నాడు. దాంతో ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు అని షాక్ అయిపోయాను.
ఆ తర్వాత కొద్దిసేపటికి
నయనతార విజ్ఞేష్ శివన్ లు ఇద్దరు డేటింగ్ చేస్తున్నారు అని చెప్పాడు.దానికి షాక్ అయిన నేను ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? నాకు ఏమీ తెలియదు అని
ధనుష్ తో అన్నాను అంటూ
రాధిక నయనతారకు సంబంధించిన ఈ డాక్యుమెంటరీలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక నయనతారకు సంబంధించిన ఈ డాక్యుమెంటరీలో కేవలం
రాధిక మాత్రమే కాదు నాగార్జున,విజయ్ సేతుపతి,తమన్నా,
దగ్గుబాటి రానా,పార్వతీ తిరువోతూ,డైరెక్టర్ అట్లీ, సీనియర్
హీరో ఉపేంద్ర వంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు కూడా మాట్లాడారు.