"తప్పు చేశాను సారీ".. యంగ్ హీరోకి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్..?

Pandrala Sravanthi
ఏంటి అల్లు అర్జున్ ఆ యంగ్ హీరోకి సారీ చెప్పారా..ఇంతకీ అల్లు అర్జున్ చేసిన తప్పేంటి..ఆయనకు ఎందుకు సారీ చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అర్జున్ ప్రస్తుతం తాను నటించిన పుష్ప-2 సినిమా విడుదల కాబోతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లోనే బిజీబిజీగా తిరుగుతున్నారు స్పెషల్ ఫ్లైట్లో ఎక్కడ ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్తూ తన సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా పుష్ప -2 మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది.అంతేకాకుండా ఈ పుష్ప టు ట్రైలర్ ని పాట్నాలో ఓ పెద్ద ఈవెంట్ ని నిర్వహించి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఫ్యాన్స్ ని చూసి బన్నీ సైతం షాక్ అయ్యారు.అయితే ఈయన సౌత్ హీరో కాబట్టి సౌత్ లోనే ఈయనకు ఫాలోయింగ్ ఉంటుంది అని అందరూ అనుకుంటారు. 

కానీ ఈయనకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారని ఈ ఈవెంట్ కి హాజరైన ఫ్యాన్స్ ని చూసి అర్ధం చేసుకోవచ్చు. ఇక పుష్ప-1 బ్లాక్ బస్టర్ అవ్వడంతో హిందీ అభిమానులు పుష్ప-2 పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇదంతా పక్కన పెడితే పుష్ప -2 ట్రైలర్ విడుదలవ్వడంతో చాలామంది అభిమానులతో పాటు సెలబ్రెటీలు కూడా బన్నీకి ట్యాగ్ చేస్తూ పుష్ప-2 ట్రైలర్ గురించి  ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతున్నారు.ఇందులో భాగంగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా పుష్పటు ట్రైలర్ కు సంబంధించి పోస్ట్ పెడుతూ పుష్ప-2 ట్రైలర్ చాలా బాగుంది అని పెట్టారు.అయితే కిరణ్ అబ్బవరం పోస్ట్ కి స్పందించిన అల్లు అర్జున్ థాంక్యూ బ్రదర్ మీరు నటించిన క మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను..

ఇక నేను సినిమా బిజీలో ఉండి క మూవీ ని చూడలేకపోయాను సారీ..త్వరలోనే ఈ సినిమా చూసి సినిమా ఎలా ఉందో మళ్లీ మీకు ఫోన్ చేసి  రిప్లై ఇస్తాను అంటూ అల్లు అర్జున్ చాలా వినయంగా మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం కి ఈ పోస్ట్ పెట్టారు. అయితే ప్రస్తుతం కిరణ్ అబ్బవరం, అల్లు అర్జున్ లు పెట్టుకున్న పోస్ట్ లకి సంబంధించిన సంభాషణ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది బన్నీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా అల్లు అర్జున్ అందరిని సమానంగా గౌరవిస్తారు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: