ప్రముఖ భారతీయ చలనచిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గారు 2015 ఫిబ్రవరి 18న వయోభారంతో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి..ఆయన సినీ ప్రస్థానం ఎప్పటికీ మరువలేనిది..1964లో తన మొదటి ప్రొడక్షన్ రాముడు భీముడుతో కెరీర్ ప్రారంభించిన రామానాయుడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ప్రొడ్యూసర్ రామానాయుడు కెరీర్ బ్రేకులు లేని బండిలా దూసుకుపోయింది .. దాదాపు 13 భారతీయ భాషల్లో 100 పై గా చిత్రాలను నిర్మించి 'మూవీ మొగల్’ గా రామానాయుడు చరిత్ర సృష్టించారు..ఆయన ప్రతిభను 2008 లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది...ఎన్నో కుటుంబ కథా చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందారు. తన పెద్దకొడుకు సురేష్ బాబు పేరు మీదుగా సురేష్ ప్రొడక్షన్స్ మొదలు పెట్టి వరుస సూపర్ హిట్ మూవీస్ తెరకెక్కించారు.. నిర్మాతగా రామానాయుడు ఓ బ్రాండ్ క్రియేట్ చేసారు..2009లో భారత ప్రభుత్వం రామానాయుడు గారిని దాదాసాహెబ్ పాల్కే అవార్డుతో సత్కరించింది..
అలాగే తన కెరీర్ లో ఎన్నో విభిన్న చిత్రాలు నిర్మించినందుకు గాను ఎన్నో ప్రశంసలతో పాటు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అలాగే మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం అందుకున్నారు..రామానాయుడు సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు..1999-2004 మధ్యకాలంలో గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు..తన తండ్రిని అకాల మరణానికి హీరో విక్టర్ వెంకటేష్ భావోద్వేగానికి గురయ్యారు. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో వెంకీ తన తండ్రి గురించి ఇలా వ్రాశాడు, “నాన్న ఇన్నాళ్లు నువ్వందించిన జ్ఞాపకాలకు నా ధన్యవాదాలు.నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తాను, మేము చేసే ప్రతి సినిమాలో నువ్వు మాతోనే ఉంటావు అంటూ ఎమోషనల్ అయ్యారు.. తండ్రి మరణాన్ని సురేష్ బాబు సైతం జీర్ణించుకోలేకపోయారు.. తండ్రితో ఎక్కువ బాండింగ్ వున్న సురేష్ బాబు దుఃఖాన్నీ ఆపుకోలేక పోయారు.. మనవడు రానా సైతం భావొద్వేగానికి గురయ్యారు..