15 ఏళ్లుగా అతనితో కీర్తి సురేష్ ఎఫైర్.. దుబాయిలో అలాంటి పనులు ?
ప్రస్తుతం కీర్తి సురేష్ కోలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా సినిమా అవకాశాలు రావడంతో తన పూర్తి దృష్టిని అటువైపే పెట్టింది. కీర్తి సురేష్ సినిమాల కన్నా ఈ మధ్యకాలంలో వ్యక్తిగత విషయాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. రీసెంట్ గా అనిరుద్, కీర్తి సురేష్ క్లోజ్ గా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు. కాగా, కీర్తి సురేష్ తొందరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనుందని గతంలో ఎన్నో రకాలుగా వార్తలు వచ్చాయి.
దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ వివాహం ఫిక్స్ అయిందని పెద్ద ఎత్తున ఓ వార్త వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై కీర్తి సురేష్ స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. కాగా, తాజాగా మరోసారి కీర్తి సురేష్ వివాహానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. తన చిరకాల మిత్రుడితో కీర్తి సురేష్ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారట.
గోవా బీచ్ లో పెళ్లి వేదికను ఖరారు చేశారని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. వీరి వివాహం వచ్చే నెల డిసెంబర్ 11, 12 తేదీలలో గోవాలో జరగనున్నట్లుగా ప్రాథమిక సమాచారం. తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనీ తటిల్ తో ఆమె వివాహం జరగనుంది. వీరిద్దరూ 15 సంవత్సరాల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా సమాచారం. ఇక ఆంటోని దుబాయిలో వ్యాపారం చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఈ వార్తలపై కీర్తి సురేష్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.