కొడుకుపై బెంగ విజయ నిర్మలని మంచాన పడేసిందా..?

Pandrala Sravanthi
- కొడుకు జీవితంపై బెంగపెట్టుకున్న విజయనిర్మల..
- తల్లిని కోల్పోయినందుకు గుక్కపెట్టి ఏడ్చిన నరేష్..

 దివంగత నటి విజయ నిర్మల మరణం చాలా బాధాకరం.. ఆమె మరణించిన సమయంలో కొడుకు నరేష్ ఎంతలా కృంగిపోయారో చెప్పనక్కర్లేదు.తల్లి మరణాన్ని తలుచుకొని వెక్కివెక్కి ఏడ్చారు.. వేలకోట్ల ఆస్తులు సంపాదించి పెట్టిన విజయనిర్మల  మరణం నరేష్ ని కలిచివేసింది.మరి తల్లి మరణం నరేష్ ని ఎలా బాధ పెట్టిందో ఇప్పుడు చూద్దాం.
 విజయనిర్మల మరణం:

1946 ఫిబ్రవరి 20న పుట్టిన విజయనిర్మల చిన్నప్పటినుండే సినిమాల మీద ఆసక్తితో పెరిగింది. అలా బాలనాటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటిసారి రంగులరాట్నం సినిమాతో హీరోయిన్గా మారిపోయింది. అయితే విజయ నిర్మలకి సినిమాల మీద పిచ్చి ఎక్కువగా ఉండడంతో మొదటి భర్తతో ఎక్కువగా గొడవలు జరిగేవట.అలా మొదట కృష్ణమూర్తిని పెళ్లి చేసుకున్న విజయనిర్మల పిల్లలు పుట్టాక ఆయనతో విడాకులు తీసుకుంది.ఇక విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయిపోయింది. అలా సినిమాల్లో చేస్తున్న సమయంలోనే కృష్ణతో ప్రేమలో పడి కృష్ణని రెండో వివాహం చేసుకుంది. ఇక విజయనిర్మల కృష్ణ కాంబినేషన్లో దాదాపు 50 సినిమాల దాకా వచ్చాయి. అలా వారిమధ్య సాన్నిహిత్యం కుదిరింది. ఇక కృష్ణ విజయనిర్మలకు పెళ్లి అయినప్పటికీ వీరిద్దరికీ పిల్లలు లేరు.

 ఎందుకంటే అప్పటికే కృష్ణకు ఇందిరా  దేవితో కలిగిన పిల్లలు అలాగే విజయనిర్మలకు కృష్ణమూర్తి తో కలిగిన పిల్లలు ఉండడంతో వీరిద్దరూ పిల్లలు వద్దనుకున్నారు. ఇక విజయనిర్మల కేవలం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా..దర్శకురాలిగా.. ఎంతో మంచి ప్రతిభ కనబరిచింది. అంతేకాకుండా ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా కూడా విజయనిర్మలకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. అలాంటి  విజయనిర్మల తన సినిమాల ద్వారా ఇప్పటికే వేల కోట్ల ఆస్తులు సంపాదించింది. దాదాపు విజయనిర్మల 1000 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిందని, 1000కోట్లకు ఏకైక వారసుడు నరేష్ అని ఇప్పటికైనా వార్తలు వినిపించాయి.. అయితే అలాంటి విజయనిర్మల అనారోగ్య సమస్యల కారణంగా మంచాన పడింది. ఇక చివరికి హార్ట్ ఎటాక్ రావడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స తీసుకుంటూనే 2019 జూన్ 27న మరణించింది. ఇక ఈమె మరణం నరేష్ ని ఎంతగానో కలిచివేసిందట.

అయితే విజయనిర్మల అనారోగ్యానికి కారణం కూడా నరేష్ మీద బెంగతోనే అని తెలుస్తుంది. ఎందుకంటే నరేష్ అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక మూడో భార్యతో గొడవలు ఎక్కువవ్వడంతో తన కొడుకు పరిస్థితి ఏమవుతుందోనని బెంగపెట్టుకొని విజయనిర్మల మంచాన పడిందట. ఇకతల్లి మరణం నరేష్ ని చాలా కృంగదీసింది.. అంతేకాదు తల్లి మరణించాక ఓ ఇంటర్వ్యూలో తల్లి మరణం గురించి మాట్లాడుతూ.. మా అమ్మ చనిపోయే ముందు ఎన్నో ఇబ్బందులు పడింది. జ్ఞాపకశక్తి కోల్పోయి నడవలేని పరిస్థితిలో టార్చర్ అనుభవించింది.కానీ తాను పడుతున్న బాధ కృష్ణగారికి తెలియకుండా ఆయన దగ్గర నవ్వుతూ తన బాధని దాచుకునేది.ఇక మా అమ్మ పడుతున్న బాధని చూసి నేను ఎన్నోసార్లు ఏడ్చాను అంటూ నరేష్ ఎమోషనల్ అయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: