కృష్ణ మరణంపై మహేష్ బాబు ఎమోషనల్.. అర్ధరాత్రి అలా చేశారా..?
- కృష్ణ మరణంతో గుండెలు పగిలేలా ఏడ్చిన మహేష్..
సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వంగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు కృష్ణకు ఎలా అయితే లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ఆ తర్వాత తన కొడుకుగా వచ్చిన మహేష్ బాబు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ అమ్మాయిలకు అయితే మహేష్ అంటే ఒక రకమైన పిచ్చి.. మహేష్ కోసం ఓ పక్క కోసుకోమన్న కోసుకుంటారు.అంతలా వారికి మహేష్ బాబు పై ప్రేమ ఉంటుంది. ఇక మహేష్ బాబు నమ్రతర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయంలో అయితే ఎంతో మంది అమ్మాయిలు కన్నీళ్లు పెట్టుకున్నారట.. ఇదంతా పక్కన పెడితే మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించిన సమయంలో ఎలా ఎమోషనల్ అయ్యారు అనేది ఇప్పుడు చూద్దాం.
కృష్ణ మరణం :
1943 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు నటుడు కృష్ణ.ఈయన అసలు పేరు శివరామకృష్ణమూర్తి.కానీ సినిమాల్లోకి వచ్చాక శివరామకృష్ణమూర్తి అనే పేరు బాలేదని ఆదుర్తి సుబ్బారావు కృష్ణ అని మార్చేశారు. అయితే ఈయనకు చిన్నతనం నుండే నాటకాలు సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం ఉండేది.అలా సీనియర్ ఎన్టీఆర్ అభిమానిగా పెరిగిన ఈయన ఎన్టీఆర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాల్లోకి వచ్చారు.అయితే ఓ రోజు అక్కినేని నాగేశ్వరరావు కి కృష్ణ చదివే కాలేజీలో సన్మానం చేశారు.ఇక ఆ సన్మానానికి విచ్చేసిన ఏఎన్ఆర్ చూడడానికి ఎంతో మంది జనాలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే ఆ జనాలందరిని చూసి ఆశ్చర్యపోయిన కృష్ణ తాను కూడా అలా పెద్ద హీరో అవ్వాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యారట. అలా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న సహాయక పాత్రలు చేసి తేనె మనసులు మూవీతో మొదటిసారి హీరోగా చేశారు. అలా మొదలైన ఆయన ప్రస్తానం దాదాపు 340 కి పైగా సినిమాలు చేసేవరకు సాగింది.