యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు బృందావనం అనే సినిమా రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదలు కావడానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే విషయాల గురించి దిల్ రాజు ఒక ఇంటర్వ్యూలో భాగంగా క్లియర్ గా చెప్పుకొచ్చాడు. బృందావనం సినిమా గురించి దిల్ రాజు మాట్లాడుతూ ... నా బ్యానర్ లో వంశీ పైడిపల్లి మొదటగా మున్నా అనే సినిమాను రూపొందించాడు. ఇది దర్శకుడిగా వంశీకి కూడా మొదటి సినిమా.
ఇక మూవీ విడుదల అయింది. కానీ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. దానితో ఆయన చాలా డీలా పడిపోయాడు. ఇక నేను ఆయనతో నువ్వు ఏ తప్పు చేయలేదు. సినిమా కథలో లోపం ఉంది. నువ్వు మంచి కథను రెడీ చేసుకో. నేను మళ్ళీ నీతో సినిమా చేస్తాను అన్నాను. దానితో ఆయన చాలా మంది రైటర్స్ తో కలిసి బృందావనం కథను రెడీ చేశాడు. ఆ కథ నాకు చాలా బాగా నచ్చింది. ఇక ఎన్టీఆర్ అప్పటికే మాస్ సినిమాలు చేస్తూ వస్తుండడంతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కాబట్టి ఆయనపై బాగా వర్కౌట్ అవుతుంది అని నాకు అనిపించింది. ఆయనకు కథ చెబితే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అంతకుముందు ఎన్టీఆర్ ఎక్కువ శాతం మాస్ లుక్ లో కనిపించేవాడు.
బృందవనం సినిమా కోసం ఆయనకు క్లీన్ షేవ్ చేసి మీసాలను కూడా చాలా వరకు తీసేసాం. ఇక ఒక లుక్ ను బయటకు వదిలేక చాలా మంది ఆ లుక్ బాగోలేదు. ఎన్టీఆర్ కి అస్సలు సెట్ కాలేదు అనే విమర్శలు చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత దాన్ని అద్భుతంగా ఉంది అంటారు అని నేను నమ్మకంగా ఉన్నాను. చివరకు అదే జరిగింది. ఆ సినిమాలోని ఎన్టీఆర్ లుక్ కి సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి అని దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.