ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ తో సినిమా అంటే ఒకప్పుడు చాలామంది హీరోలు తెగ ఇష్టపడే వారట. ఎందుకంటే మిస్ వరల్డ్ తో సినిమా చేస్తున్నాము అని వారిలో ఓ ఆసక్తి ఉండేది. అయితే అలాంటి మాజీ మిస్ వరల్డ్ లో అయినటువంటి ఐశ్వర్య రాయ్ మొదటిసారి ఏ హీరో తో రొమాన్స్ చేసిందో తెలుసా.. అయితే చాలామందికి ఈ విషయం తెలియదు. అయితే చాలా మంది సల్మాన్ ఖాన్ లేదా బాలీవుడ్ హీరో ఎవరైనా అనుకుంటారు. కానీ ఐశ్వర్య రాయ్ మొదట రొమాన్స్ చేసింది బాలీవుడ్ హీరోలతోనో కాదు ఓ సౌత్ హీరోతోనే.. అవును మీరు వినేది నిజమే. మలయాళ హీరో మోహన్ లాల్ అంటే తెలియని వారు ఉండరు. ఈయనకి ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో అప్పట్లో ఇంతకంటే డబల్ క్రేజ్ ఉండేది.
అయితే అలాంటి మోహన్ లాల్ తో ఐశ్వర్య రాయ్ మొదట సినిమా చేసింది. ఐశ్వర్య రాయ్ డైరెక్టర్ మణిరత్నంని ఎంతలా అయితే పొగుడుతుందో తన మొదటి సినిమా హీరో అయిన మోహన్ లాల్ ని కూడా అంతే పొగుడుతుంది. ఇక మోహన్ లాల్ ఐశ్వర్య రాయ్ కాంబో లో వచ్చిన సినిమా ఇరువర్. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1997 లో విడుదలైంది.ఈ సినిమా జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి జీవితాల స్పూర్తి తో తెరకెక్కిన ఓ పొలిటికల్ డ్రామా.
అలా మొదటిసారి ఐశ్వర్యరాయ్ మోహన్ లాల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.ఇక మోహన్ లాల్ గురించి ఓ సందర్భంలో ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ.. మోహన్ లాల్ కి నటన అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం.. అంటూ గొప్పగా పొగిడింది. అలా విశ్వ సుందరి అయినటువంటి ఐశ్వర్య రాయ్ మొట్ట మొదటిసారి రొమాన్స్ చేసింది మోహన్ లాల్ తో అనే విషయం చాలా మందికి తెలియదు