ఫాహద్ తో మొదట ఆ సినిమా చేయాల్సింది కానీ అందుకే మిస్ అయింది.. నజ్రియా..?

MADDIBOINA AJAY KUMAR
మలయాళ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఫహద్ ఫాజిల్ ఒకరు. ఈయన మలయాళం లో మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా అనేక భాషల సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈయన అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 1 అనే తెలుగు సినిమాలో నటించాడు. ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన పుష్ప పార్ట్ 2 సినిమాలో కూడా ఈయన నటించాడు.

ఈ మూవీ డిసెంబర్ 5 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ మలయాళ నటి అయినటువంటి నజ్రియా ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరి వివాహం తర్వాత కూడా వీరు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇకపోతే తాజాగా నజ్రియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తమ ప్రేమ గురించి అనేక ఆసక్తికరమైన వివరాలను నజ్రియా తెలియజేసింది.

తాజా ఇంటర్వ్యూ లో బాగంగా నజ్రియా మాట్లాడుతూ ... నేను , ఫహద్ కలిసి మొదటగా బెంగళూరు డేస్ సినిమా చేశాం. కానీ అంతకు ముందే నాకు , పహాద్ నటించిన ఓ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ నాకు సమయంలో ట్వేల్త్ ఎగ్జామ్స్ ఉండటం వల్ల ఆ సినిమాను వదిలేసాను. నాకు ఫహద్ నటించిన ఆర్టిస్ట్ అనే సినిమాలో మొదటగా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమాను వదిలేసాను. ఆ తర్వాత బెంగళూరు డేస్ సినిమాలో నేను ఫాహద్ తో కలిసి నటించాను. ఆ సినిమా సమయం లోనే మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఆ తర్వాత మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని ఈ నటి తాజాగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: