సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగాలి అంటే చాలా మంది అందం , అభినయం , నటన ఎంతో ముఖ్యమని ఈ క్వాలిటీస్ ఉన్న ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లడం మాత్రమే కాకుండా చాలా కాలం పాటు అదే స్థానంలో కెరియర్ను కొనసాగిస్తూ ఉంటారు అని అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరి కొంత మంది మాత్రం అందం , అభినయం , నటన కంటే కూడా స్టార్ హీరోయిన్గా ఎదగాలన్న ఎదిగిన తర్వాత కెరియర్ను అదే దశలో కొనసాగించాలి అంటే విజయాలు చాలా ముఖ్యం అని , ఏన్ని విజయాలు వస్తే అంత ఎక్కువగా కెరియర్ ఫుల్ జోష్లో ముందుకు దూసుకుపోతోంది అనే వాదనను మరి కొంత మంది వినిపిస్తూ వస్తున్నారు.
ఇకపోతే అందం , అభినయం , నటన వరుస విజయాలు వీటన్నింటితో పాటు మరో లక్షణం కూడా స్టార్ హీరోయిన్ కావాలి అంటే ఉండాలి అని కొంత మంది ఒక వాదనను వినిపిస్తున్నారు. అది ఏమిటి అంటే .? ఒక దశలో క్రేజ్ వచ్చాక హీరోయిన్ల దగ్గరికి అనేక కథలు వస్తూ ఉంటాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు ఉంటాయి. మామూలు సినిమాలు కూడా ఉంటాయి. ఇక అవకాశాలు వచ్చాయి కదా అని ఒక దాని తర్వాత ఒక సినిమాని ఓకే చేసుకుంటూ వెళ్ళకూడదు అని , అందులో ఏది సక్సెస్ అయ్యే స్టోరీ , ఏది ఫ్లాప్ అయ్యే స్టోరీ అనే దానిని గ్రహించి సక్సెస్ అయ్యే కథలను ఓకే చెప్తూ , ఫెయిల్యూర్ అయ్యే కథలను రిజెక్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా వారి కెరియర్ అద్భుతమైన దశలో ముందుకు సాగుతుంది అని , అలాగే కేవలం ఎప్పుడూ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలలో మాత్రమే కాకుండా వైవిధ్యమైన పాత్రలలో నటించడం ద్వారా నటిగా మరింత స్కోప్ వచ్చే అవకాశం ఉంటుంది అనే వాదనను మరి కొంత మంది వినిపిస్తున్నారు.