నయనతార : నన్ను నమ్మించాడు..వాడుకున్నాడు..మోసం చేశాడు?

Veldandi Saikiran
నయనతార గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. 2003 సంవత్సరంలో ఈ చిన్నది మలయాళ సినీ పరిశ్రమ ద్వారా వెండితెరకు పరిచయమైంది. అనంతరం తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలలో నటించి నయనతార మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా రాణించింది.

సినిమాల పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార సక్సెస్ఫుల్ హీరోయిన్ గా రాణించింది. ఇక 2002లో డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను నయనతార ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరూ మగ కవల పిల్లలు ఉన్నారు. తాజాగా కొన్ని రోజుల క్రితం నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కథతో డాక్యుమెంటరీని నెట్ ఫ్లిక్స్ సంస్థ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నయనతార సినీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, కుటుంబం, తన జీవితంలో కష్ట నష్టాలు అన్నింటిని పంచుకుంది.

తన రిలేషన్షిప్ గురించి నయనతార చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని నయనతార అన్నారు. నేను అతని మనస్ఫూర్తిగా నమ్మి ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని అనుకున్నానని నయనతార వెల్లడించారు. కానీ ఆ వ్యక్తి నన్ను నమ్మించి మోసం చేశాడని బాధపడింది. గతంలో తన రిలేషన్స్ గురించి ప్రజలు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుకున్నారని నయనతార బాధపడింది. తాను ఒక అమ్మాయిని కాబట్టి అలా మాట్లాడుతున్నారు.

అదే అబ్బాయి అయితే ఎందుకు ఇలా మాట్లాడరు అంటూ నయనతార ప్రశ్నించారు. ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని మోసం చేశావు అని మగాళ్ళను అడిగే వారు ఎవరూ ఉండరు. అదే అమ్మాయిలను మాత్రం తప్పకుండా అడుగుతారు అంటూ నయనతార అన్నారు. తప్పంతా అమ్మాయిలది అన్నట్టుగా చాలా రకాలుగా వార్తలు రాస్తారు అంటూ నయనతార భావోద్వేగానికి గురైంది. కానీ తాను ఎవరి వల్ల మోసపోయింది అనే విషయాన్ని మాత్రం నయనతార చెప్పలేదు ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: