అనుమోలు ఇంటికి వెళితే అక్కినేని కోడ‌లు ఎలా ? అవుతుంది..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
అక్కినేని ఇంటి కోడలు అవుతున్న మీనాక్షి చౌదరి ఈ టైటిల్ తో గత వారం రోజులుగా తెలుగు మీడియాలో తెలుగు సోషల్ మీడియాలో ఒక్కటే వార్తలు వస్తున్నాయి. మీనాక్షి చౌదరి నార్త్ ఇండియన్. ఆమె సొంత రాష్ట్రం పంజాబ్. ఆమె కులం జాట్స్ .. జాట్స్‌ అంటే నార్త్ లో జాట్స్‌ కులాన్ని చౌదరి అని పిలుస్తారు. అంటే మ‌న తెలుగులో క‌మ్మ కిందే లెక్క‌. ఆమె అక్కినేని కుటుంబ సభ్యుడు సుశాంత్ ను పెళ్లి చేసుకోబోతున్న వార్త ఒక్కసారిగా వైరల్ అవుతుంది. సుశాంత్ కు ఇప్పటికే 38 ఏళ్లు దాటేసాయి. మీనాక్షి చౌదరి తొలి సినిమా సుశాంత్ తో చేసింది. అప్పటినుంచి వారిద్దరూ మంచి స్నేహితులు. ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నారు.

ఇప్పుడు మీనాక్షి ఒక స్టార్ హీరోయిన్ సుశాంత్ కు మీనాక్షి భార్య అయితే ఆమె అక్కినేని ఇంటి కోడలు ఎలా అవుతుంది ? సుశాంత్ అక్కినేని కాదు .. వాళ్ళ ఇంటి పేరు అనుమోలు .. దివంగత లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావుకు కూతురు కొడుకు సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణరావు. ఆయన తండ్రి ఏవి సుబ్బారావు. గతంలో నిర్మాత. సో ఆ కుటుంబానికి తెలుగు సినిమా చరిత్రలో స్థానం ఉంది. మరి ఆ లెక్కన మీనాక్షి సుశాంత్ ను పెళ్లి చేసుకుని భార్య అయితే అక్కినేని ఇంటికోడలు ఎలా అవుతుంది .. అనుమోలు ఇంటి కోడలు అవుతుంది.

సుశాంత్ తల్లి నాగ సుశీల నాగేశ్వరరావు బిడ్డ నాగార్జున సోదరి ఆమె అనుమోలు ఇంటికి కోడలుగా వెళ్ళింది. ఆమె కాదు ఆమె సోద‌రి సత్యవతి కొడుకు సుమంత్ ఇంటిపేరు యార్ల‌గడ్డ. అంతే తప్ప తను కూడా అక్కినేని సుమంత్ కాదు .. నాగచైతన్య మాత్రం అక్కినేని వారసుడు అవుతాడు ఎందుకంటే అత‌డు నాగార్జున కుమారుడు. తల్లి దగ్గుబాటి ఫ్యామిలీలో పుట్టిన ఆమెకు నాగార్జునకు పుట్టిన కొడుకు కాబట్టి ఇబ్బంది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: