అఫైర్ల పై స్పందించిన నయనతార.. ఏమన్నదో తెలుసా?
కానీ నయనతార మాత్రం తనకున్న ఓల్డ్ అఫైర్స్ గురించి పెదవి విప్పింది. శింబు, ప్రభుదేవా లాంటి స్టార్స్ తో తనకు అఫైర్ ఉందనే విషయాన్ని ఆమె బహిరంగంగా చెప్పలేదు కానీ ఒక్కొక్కరితో తన రిలేషన్షిప్ ఎలా ఉండేదో ఆమె నిర్భయంగా బయటపెట్టేసింది. ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రారంభంలోనే శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. తాను ఒక్కసారి ఎవరితోనైనా ప్రేమలో పడితే వారిని గుడ్డిగా నమ్మేస్తానని, ప్రేమలో నమ్మకం అనేది ముఖ్యం కాబట్టి అలా చేస్తానని చెప్పుకొచ్చింది. వారు కూడా తన విషయంలో నమ్మకంగానే ఉంటారని భావించిందట. కానీ ఆ వ్యక్తి తన నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆమె డాక్యుమెంటరీలో వాపోయింది. అసలు అతడు తనను ప్రేమించనేలేదని, ఓన్లీ తన అవసరాల కోసం తనని వాడుకున్నాడని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఒకప్పుడు శింబు, నయనతార లిప్ కిస్ పెట్టుకుంటున్న పిక్స్ ఇంటర్నెట్లో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి.
ఇక కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఆమె ప్రభుదేవా ప్రేమలో పడింది. అతని పేరు ప్రస్తావించకుండానే అతనితో తన రిలేషన్షిప్ ఎలా ఉండేదో ఆమె చెప్పుకొచ్చింది. తాను సినిమాలను పూర్తిగా మానేస్తేనే పెళ్లి చేసుకుంటానని అతను ఒక కండిషన్ పెట్టాడట. నయనతార దానికి కూడా ఒప్పుకొని అతనితో హాయిగా జీవించాలని భావించిందట. కానీ తాను అనుకున్నట్లు పెళ్లి కాలేదని ఆమె తెలిపింది. శ్రీరామరాజ్యం తన చివరి మూవీ అని, ఆ తర్వాత సినిమాలు పూర్తిగా మానేద్దామని డిసైడ్ అయ్యిందట. అయితే అలా చేద్దామనుకునే లోపే ప్రభుదేవాతో పెళ్లి అయ్యే అవకాశం లేదని ఆమెకు తెలిసి వచ్చింది. ఇలా ఇద్దరి వల్ల ఆమె ఎన్నో బాధలు పడింది. వారి కళ్ళ ముందు కెరీర్ ఒక పెద్ద రేంజ్కి రావాలనే కసితో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అనుకున్నదే ఆమె సాధించింది.