బాలయ్యతోనే పోటీకి రెడీ అయిన మోక్షజ్ఞ.. ఫ్యాన్స్ షాక్?
నందమూరి బాలకృష్ణ పాలిటిక్స్‌లోనే కాదు సినిమాల్లో కూడా దూసుకెళ్తున్నారు. ఆయన ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. చిరంజీవి కూడా ఈ ఏజ్ లో సోలోగా సింగిల్ హిట్ కొట్టడానికి తెగ తిప్పలు పడుతున్నారు. బాలకృష్ణ మాత్రం సునాయాసంగా హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ పోతున్నారు. అయితే ఇతనికి ఇతర సీనియర్ హీరోలు పోటీ ఇవ్వలేకపోయినా ఓ కుర్ర హీరో మాత్రం పోటీ వచ్చేలాగా కనిపిస్తున్నారు. ఆ మరొకరు మరెవరో కాదు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞనే. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మతో కలిసి ఫస్ట్ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రశాంత్. అందువల్ల ఆయన దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా వస్తున్న సినిమాపై భారీ ఎత్తున అంచనాలు నెలకొన్నాయి.
బాలకృష్ణ తన కుమారుడి ఫస్ట్ మూవీని ఎలాగైనా హిట్ చేయాలని చాలా కృషి చేస్తున్నారు. ఆయన ఈ మూవీ పనులన్నీ దగ్గరుండి జరిపిస్తున్నారని సమాచారం. అంతేకాదు ఆయన తాను నటిస్తున్న "డాకు మహారాజ్" షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. ఈ బాలయ్య మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. బాలకృష్ణ కొంత షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేస్తే ఈ మూవీ చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. దీని తర్వాత ఆయన ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా అఖండ-2 మూవీ షూటింగ్లో పాల్గొననున్నారు. డిసెంబర్ రెండో వారంలో బాలకృష్ణతో పాటు అఖండ 2 కీలక నటులందరూ పాల్గొనే లాగా బోయపాటి శ్రీను ప్లాన్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే మోక్షజ్ఞ మూవీ చిత్రీకరణ కూడా సరిగ్గా డిసెంబర్ రెండో వారంలోనే ప్రారంభం కానుంది. ఆ సమయంలోనే మోక్షజ్ఞ తొలిసారిగా ముఖానికి మేకప్ వేసుకొని, కెమెరా ముందు నటించనున్నాడు. హైదరాబాద్‌లో మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి భారీ సెట్స్ ఆల్రెడీ నిర్మించారని ప్రచారం జరుగుతోంది. ఇలా తండ్రి కొడుకులు పోటా పోటీగా సినిమా చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. అంతేకాదు వీరు నటిస్తున్న రెండు సినిమాలు కూడా పురాణాలు, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్నాయని తెలుస్తోంది. ఈ మైథాలజికల్ సినిమాలలో ఏ సినిమా బాగా హిట్ అవుతుందనేది ఇప్పుడు చర్చినీయాంశంగా మారింది. బాలయ్య తోనే ఈ నందమూరి కుర్రాడు పోటీ పడతాడా అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలకూ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్‌గా ఉన్నారు బాలయ్య చిన్న కూతురు తేజస్విని.