నాకు డైరెక్షన్ కంటే అదే ఎక్కువ ఇష్టం.. షాకింగ్ విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో రాణించాలి అంటే టాలెంట్ ఎంత ఉన్న అదృష్టం కూడా అంతే కలిసి రావాలి. అంతేకాదు ప్రేక్షకులు అందరిని మెప్పించే విధంగా సరికొత్త కథలతోరావాల్సి ఉంటుంది. అయితే ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రేంజ్ దర్శకుడిగా మారిపోయాడు ప్రశాంత్ వర్మ. అందరి దర్శకుల లాగా రొటీన్ కథలను కాకుండా విభిన్నమైన కథాంశంతో కూడిన సినిమాలను చేస్తూ సూపర్ హిట్టు సొంతం చేసుకుంటున్నాడు. అలాంటి కోవలోకి చెందినదే హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్  ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ప్రశాంత్ వర్మ వైపు చూసింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు హనుమాన్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ మారిపోయింది. అతని తర్వాత సినిమాలు ఏంటి అనే విషయంపై కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. కాగా ఇలా డైరెక్టర్ గా తనకు తిరుగులేదు అని నిరూపించుకున్న ప్రశాంత్ వర్మ.. దర్శకత్వంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. తనకు దర్శకత్వం కంటే మరో పని ఎక్కువ ఇష్టం అంటూ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.

 డైరెక్టర్ గా పని చేయడం కంటే కథలు రాయడమే తనకు ఎంతో ఇష్టమంటూ ప్రశాంత వర్మ తెలిపాడు. తాను ఇండస్ట్రీలోకి రాకముందే 33 కథలను రాసుకున్నానాని ఇప్పటికీ ఆ కథలు అలాగే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా దర్శకుడిగా ఎంత బిజీ ఉన్నప్పటికీ ఇతర దర్శకులకు కథలు కావాలి అంటే తాను ఎప్పుడు రాయడానికి సిద్ధంగానే ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. దేవకీ నందన వాసుదేవ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. మరిన్ని కథలు రాయడానికి సిద్ధంగా ఉన్నానని బోయపాటి శ్రీను తో పాటు మరికొంతమంది దర్శకులకు కథలు అందించేందుకు తాను ఎప్పుడు రెడీ అంటూ ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: